Begin typing your search above and press return to search.

ఒకే రోజు నిర్వహించిన జగన్.. షర్మిల సభల్లో ఆశ్చర్యకరమైన అంశాన్ని గమనించారా?

By:  Tupaki Desk   |   9 July 2021 4:42 AM GMT
ఒకే రోజు నిర్వహించిన జగన్.. షర్మిల సభల్లో ఆశ్చర్యకరమైన అంశాన్ని గమనించారా?
X
ఒకే రోజున.. వేర్వేరు రాష్ట్రాల్లో.. వేర్వేరు వేదికల సాక్షిగా సభల్నినిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన సోదరి వైఎస్ షర్మిల. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయాలన్న షర్మిల ఆలోచనకు జగన్ మద్దతు లేదని చెబుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. అన్నాచెల్లెళ్లు ఇద్దరు మాట్లాడుకోవటం లేదని.. వారి మధ్య మాటలు లేవన్న కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా ఈ అన్నాచెల్లెళ్లు ఇద్దరు ఇడుపలపాయకు వేర్వేరుగా వెళ్లటం.. కార్యక్రమాల్ని నిర్వహించటం తెలిసిందే. ముందుగా వినిపించిన అంచనాలకు తగ్గట్లే.. వీరిద్దరు ఎదురు పడింది లేదు. గురువారం ఉదయంఇడుపులపాయకు వెళ్లిన షర్మిల తన తండ్రికి నివాళులు అర్పించారు. ఆయన ఆశీస్సులుకోరారు. అనంతరం హైదరాబాద్ కు వచ్చి పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. ఇందుకు రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ ను వేదికగా చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఇడుపుల పాయకు వెళ్లి.. తన తండ్రి సమాధానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ఆయన అనంతపురం జిల్లాకు వెళ్లారు.

అక్కడ తాడిపత్రిలో సభను ఏర్పాటు చేశారు. రైతు దినోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తాడిపత్రిలో ఏపీ ముఖ్యమంత్రి నిర్వహించిన సభ ‘రాయదుర్గం’లో కాగా.. హైదరాబాద్ లో పార్టీ ఆవిర్భావ వేడుకను నిర్వహించిన షర్మిల సభ వేదిక కూడా ఐటీ కారిడార్ లోని ‘రాయదుర్గం’లోనే కావటం విశేషంగా చెప్పాలి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన వేదిక ఒకే పేరుతో ఉండటం విశేషం కాక మరేంటి?