Begin typing your search above and press return to search.
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్
By: Tupaki Desk | 25 Dec 2022 9:37 AM GMTగత ఐపీఎల్ సీజన్స్ లో చివరి స్థానాల్లో నిలుస్తూ చుక్కాని లేని నావలా తయారైంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. అస్సలు గెలవకుండా.. గెలిపించే ఆటగాళ్లు లేక నిట్టూర్చింది. సన్ రైజర్స్ కెప్టెన్ లు గత రెండు మూడు ఏళ్లలో ఇద్దరు మారడం ఆ జట్టు పనితీరుకు అద్దం పడుతోంది.
మొదట సన్ రైజర్స్ కు ఒక కప్ అందించిన డేవిడ్ వార్నర్ ఆ తర్వాత ఫాం కోల్పోవడంతో హైదరాబాద్ టీం అతడిని తొలగించింది. అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయంసన్ కు బాధ్యతలు అప్పగించింది. అయితే కేన్ మామ కూడా గత సంవత్సరం ఆటగాడిగా.. కెప్టెన్ గా విఫలం అయ్యాడు. దీంతో ఈ సంవత్సరం అతడిని కూడా వేలంలోకి వదిలేసి షాకిచ్చింది.
అయితే ఇంగ్లండ్ దిగ్గజ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను వేలంలో కొని కెప్టెన్ గా నియమించుకుందామని చూసిన సన్ రైజర్స్ కు అతడికి వేలంలో బాగా కోట్లు పలకడంతో విరమించుకుంది. 8.25 కోట్లు పెట్టి పంజాబ్ కెప్టెన్సీ నుంచి దించేసి వదిలేసిన మయాంక్ అగర్వాల్ ను కొనుగోలు చేసింది. ఇంతటి భారీ ధరకు మయాంక్ ను కొనడం వెనుక అతడికి కెప్టెన్సీ ఇచ్చేందుకేనన్న చర్చ సాగుతోంది.
మయాంక్ ను, హారీ బ్రూక్ ను తీసుకొని మిడిల్ ఆర్డర్ ను పటిష్టం చేసేందుకే ఈ చర్య సన్ రైజర్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా మయాంక్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా.. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలప్స్, హెన్రిల్ క్లాసన్, హారీ బ్రూక్ తో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా తయారైంది. ఇన్నాళ్లు సన్ రైజర్స్ కు లోపమే మిడిల్ ఆర్డర్. ఇప్పుడు దాన్ని మెరుగైన బ్యాటర్లను కొనుగోలు చేసి పటిష్టం చేశారు.
పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసింది.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 వేలంలో రైట్ హ్యాండ్ ఓపెనర్ అత్యంత ఖరీదైన కొనుగోలుదారుగా నిలిచాడు మరియు హైదరాబాద్‌కు చెందిన ఫ్రాంచైజీకి రూ. 8.25 కోట్లు వెచ్చించాడు. గత కొన్ని సంవత్సరాలలో IPLలో అత్యంత విజయవంతమైన భారతీయ ఓపెనర్‌లలో ఒకరిగా ఉన్న మయాంక్, పేలవమైన 2022 సీజన్ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో విడిపోయాడు.
మయాంక్ ఎస్‌ఆర్‌హెచ్‌లో చేరడం పట్ల పంజాబ్ మాజీ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే సంతోషిస్తున్నాడు. కొత్త వాతావరణం నిజంగా భారత బ్యాటర్‌కు సహాయపడుతుందని చెప్పాడు.
“పంజాబ్‌కు మయాంక్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను వదిలివేయబడ్డాడు. అతను సన్‌రైజర్స్ లాంటి జట్టుకు వెళ్ళినందుకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను, ”అని కుంబ్లే అన్నాడు. "కొత్త వాతావరణం ఖచ్చితంగా మయాంక్‌కు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను మరియు అతను జట్టు చుట్టూ ఉండటం చాలా అద్భుతంగా ఉంది" అని కుంబ్లే వివరించాడు.
సన్ రైజర్స్ వేలం తీరు చూస్తే.. బలమైన బ్యాటింగ్ లైనప్‌ను సేకరించింది. ఇప్పుడు అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ , ఐడెన్ మార్క్‌రామ్‌లతో బ్యాటింగ్ మెరుగ్గా తయారైంది. మునుపటి ఎడిషన్ టోర్నమెంట్‌లో పేలవమైన ఔటింగ్ తర్వాత జట్టు బలమైన ప్రదర్శనను కనబరుస్తుందని.. ఈ జట్టు బాగా ఉందని అంటున్నారు..
"నేను పాక్షికంగా భయాందోళన.. ఉత్సాహంగా ఉన్నాను. కానీ నేను సన్ రైజర్స్ లో భాగమైనందుకు సంతోషిస్తున్నాను. అంతర్జాతీయ అనుభవం, విజయవంతమైన ఆటగాళ్లతో మురళీధరన్, లారాతో కలిసి పనిచేయడానికి నిజంగా ఎదురు చూస్తున్నాను" అని మయాంక్ అగర్వాల్ అన్నారు. దీంతో సన్ రైజర్స్ కొత్త జట్టు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.