Begin typing your search above and press return to search.
75 సంవత్సరాల తరువాత మళ్లీ కాలేజీ స్టూడెంట్ గా..
By: Tupaki Desk | 24 April 2016 7:11 AM GMTచదువుకు వయసు అడ్డంకి కాదని చాలామంది నిరూపించారు. తాజాగా 97 ఏళ్ల వృద్ధుడొకరు యువకులతో పోటీపడుతూ పీజీ పరీక్షలకు హాజరయ్యారు. సుమారు 75 సంవత్సరాల గ్యాప్ తరువాత ఆయన పరీక్షలు రాయడం విశేషం. ఎప్పుడో 1940లో డిగ్రీ చదివిన ఆయన ఆ తరువాత ఉద్యోగంలో పడి చదువుకు పుల్ స్టాప్ పెట్టేశారు. కానీ, పీజీ చేయాలన్న ఆయన కోరిక మాత్రం తగ్గకపోవడంతో ఇప్పుడు మళ్లీ 97 ఏళ్ల వయసులో పీజీ పరీక్షలు రాస్తున్నారు. బీహార్‌లోని నలందా ఓపెన్ యూనివర్శిటీలో ఎంఏ చదువుతున్న ఆయన పేరు రాజ్ కుమార్ వైశ్య. లేటు వయసులో చదువుకున్నవారు చాలామందే ఉన్నా కూడా ఇలా 75 ఏళ్ల గ్యాప్ తరువాత మళ్లీ కాలేజీ బాట పట్టినవారు మాత్రం అరుదే.
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ 1920లో జన్మించారు. ఆగ్రా యూనివర్శిటీ నుంచి 1940లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశారు. అయితే కుటుంబ బాధ్యతల కారణంగా ఉన్నత చదువులు కొనసాగించలేకపోయారు. 1980లో ఉద్యోగం నుంచి రిటైరయ్యారు. అయితే ఇన్నేళ్లయినా ఉన్నత చదువులు చదవాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. తన కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలని నిశ్చయించుకున్న రాజ్ కుమార్, గతేడాది నలందా ఓపెన్ యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్సులో చేరారు. ఎట్టకేలకు 97 ఏళ్ల వయసులో ఎంఏ పరీక్షలు రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజ్ కుమార్ ప్రస్తుతం పాట్నాలోని తన రెండో కుమారుడు సంతోష్ తో ఉంటున్నారు.
కాగా నలందా యూనివర్శిటీలో పరీక్షలు రాసిన రెండో వృద్ధ విద్యార్థి రాజ్ కుమార్. ఇటీవలే 84 ఏళ్ల రామ్ చంద్ర మిశ్రా అనే రిటైర్డ్ ప్రొఫెసర్ ఈ యూనివర్శిటీలో పిహెచ్ డీలో చేరిన విషయం తెలిసిందే. అయితే... రాజ్ కుమార్ కు ఆయన కంటే మరో ఏడేళ్లు వయసెక్కువ. దీంతో చారిత్రక నలంద యూనివర్సిటీలో అత్యధిక వయసున్న విద్యార్థిగా రాజ్ కుమార్ రికార్డులకెక్కారు.