Begin typing your search above and press return to search.
ఇపుడంతా ఓకేనా... ఫుల్ సెక్యూరిటీ అంటగా
By: Tupaki Desk | 20 Jun 2022 6:36 AM GMTసికింద్రాబాద్ స్టేషన్లో రైలు బండికి సిగ్నల్ ఇచ్చేశారు నిన్నటి వేళ. అగ్నిపథ్ నిరసనల వేళ మూడు రైళ్లు అగ్నికీలలకు ఆహూతి అయిన నేపథ్యం విధితమే ! ఈ నేపథ్యంలో చాలా రైళ్లు రద్దు చేశారు. పోలీసుల బలగాలు మోహరించి ప్రయాణికుల భద్రతను మరింత పెంచారు. దీంతో పాటు అల్లర్లకు పాల్పడిన వారిని వీడియో ఫుటేజీ ఆధారంగా, వాట్సాప్ ఛాటింగుల ఆధారంగా పట్టుకున్నారు. అల్లర్లకు పాల్పడిన ఘటనలో రెండు వందల మందిని అరెస్టు చేశారు.
తాజా పరిస్థితులు చక్కబడుతున్న తరుణాన రైలు అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహింపజేసి, నిన్నటి వేళ పలు రైలు సర్వీసులను పునరుద్ధరింపజేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించి రికార్డు సృష్టించారు.
కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల దగ్గర ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండడంతో మరోసారి భద్రతా బలగాలను మోహరింపజేసి తనిఖీలు ముమ్మరం చేసి, టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. అదేవిధంగా ప్లాట్ ఫాంలను పలు సార్లు తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో ఉద్రిక్తత వాతావరణం ఏమీ లేదని నిర్థారించుకుని తరువాతే రైలు సర్వీసులకు అనుమతి ఇవ్వడం గమనార్హం.
అగ్నిపథ్ ప్రకటనను మరోసారి ధ్రువీకరిస్తూ దేశ అత్యున్నత స్థాయి అధికారులు నిన్నటి వేళ మీడియా ప్రకటనను జారీ చేశారు. ఆందోళనలలో పాల్గొన్న వారికి ముఖ్యంగా ఆస్తుల ధ్వంసంలో పాల్గొన్న వారికి ఆర్మీలో నో ఎంట్రీ అని తేల్చేశారు. ఒక్క ఆర్మీ అనేకాదు త్రివిధ దళాలలో నో ఎంట్రీ అని తేల్చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలిపిన వారికి, ప్రభుత్వంతో చర్చలలో పాల్గొన్నవారే అగ్నిపథ్ నోటిఫికేషన్ ద్వారా హై లెవల్ సెక్యూరిటీ ఫోర్సెస్ లో చేరేందుకు అర్హులని తేల్చేశారు.
వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు ఉంటాయి అని, ఇవి పూర్తిగా అగ్పిపథ్ నోటిఫికేషన్ కు అనుగుణంగానే ఉంటాయని తెలిపారు సంబంధిత అధికారులు.
ఇవాళ అంటే జూన్ 20,2022 న అగ్నిపథ్ నియామకాలకు సంబంధించి డ్రాఫ్ నోట్ ఒకటి విడుదల చేస్తామని లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప తెలిపారు. ఆసక్తి ఉన్న యువకులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనసవర ఆందోళనలు వీడి దేశ భద్రతా బలగాల్లో చేరాలనుకున్న యువకులు సంబంధిత పరీక్షలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.