Begin typing your search above and press return to search.

తాజ్‌మహల్‌ను మూసేయాలన్న ఆగ్రా మేయర్ .. ఎందుకంటే !

By:  Tupaki Desk   |   7 March 2020 5:56 AM GMT
తాజ్‌మహల్‌ను మూసేయాలన్న ఆగ్రా మేయర్ .. ఎందుకంటే !
X
కరోనా వైరస్ ..ప్రస్తుతం 92 దేశాలకి విస్తరించి, ఆ దేశాల ప్రజలకి సరైన నిద్ర లేకుండా భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మూడువేల మందికి పైగా మృత్యువాత పడటం, సుమారు గా లక్షమందికి పైగా ఈ వైరస్ తో భాదపడుతుండటం తో ..పలు దేశాల ప్రజలు ఈ కరోనా వైరస్ పేరు వింటేనే గజగజ వణికిపోతున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ కరోనా వైరస్ మన దేశంలోకి కూడా ఎంట్రీ ..తన ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు భారత్ లో 31 పాజిటివ్ కరోనా కేసులు నమోదైయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆగ్రా మేయర్ నవీన్ జైన్ .. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యం లో ఆగ్రా లోని తాజ్‌ మహల్‌‌ తోపాటు ఇతర పురాతన కట్టడాలను ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా మూసివేయాలని కేంద్రాన్ని కోరారు. మనదేశంలోకి కరోనా వైరస్ రావడానికి ఒకరకంగా విదేశీయులు కారణం. భారత్ లో పర్యటన కోసం విదేశాల నుండి వస్తున్న వారిలోనే కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్‌‌ను చూసేందుకు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆగ్రా నగరానికి వస్తున్నారు, దీనివల్ల ఆగ్రా నగరంలో కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి అని అయన తెలిపారు.

దీనితో కరోనా వైరస్ అదుపులోకి వచ్చే వరకూ తాజ్‌ మహల్‌‌ తోపాటు ఫతేపూర్ సిక్రీ కోట, ఆగ్రాలోని కోట, ఇతర పురాతన కట్టడాలను మూసివేసి పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకోవాలి అని మేయరు నవీన్ జైన్ కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ రాసారు.ఇకపోతే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. తాజ్‌ మహల్‌ ను చూసేందుకు వచ్చిన 2,915 మంది విదేశీ పర్యాటకులను ఆగ్రా జిల్లా వైద్యాధికారులు పరీక్షించగా, వారిలో 708 మందిని హోం ఐసోలేషన్ కు తరలించారు. ముగ్గురు విదేశీ పర్యాటకులకు కరోనా వైరస్ లక్షణాలుండటం తో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.