Begin typing your search above and press return to search.
ఆ సీఎంపై వ్యాఖ్యలు.. యువకుడు అరెస్ట్!
By: Tupaki Desk | 27 July 2018 9:17 AM GMTచేతిలో సెల్లుఫోను ఉండి.. అందులో సోషల్ మీడియా అకౌంట్ ఉన్నంతనే.. మనసుకు తోచినట్లు.. చేతికి వచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా ఎవరి మీద పడితే వాళ్ల మీద తిట్ల వర్షం కురిపించకూడదు. మాట్లాడే మాటలోనూ.. రాసే రాతలోనూ అంతో ఇంతో ధర్మం ఉండాలి. అందుకు భిన్నంగా తిట్టిపోయేటమే పనిగా.. అభ్యంతరక భాషలో ఇష్టారాజ్యంగా మెసేజ్ లు గుప్పిస్తే.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
తాజాగా యూపీలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఒక యువకుడు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఆగ్రాలోని బీహార్ కుంజ్ ప్రాంతానికి చెందిన వినీత్ ప్రతాప్ సింగ్ అనే కుర్రాడు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి యోగిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో సీఎం మీద దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఆ యువకుడ్ని గుర్తించారు. అతగాడి గురించి ఆరా తీసిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. సీఎం యోగిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వినీత్ ను పోలీసులు గుర్తించారు. అతనిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇదే నెలలో అసద్ సిద్దిఖీ అనే యువకుడు కూడా సీఎం యోగిపై ఫేస్ బుక్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా.. ఆ పోస్టుపై వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆరుగురు కామెంట్లు చేశారు. ఇందులో ఒకడు వినీత్ గా చెబుతున్నారు. అతగాడి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నపోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు. సో.. ప్రముఖుల మీద నోరు పారేసుకుందామని అనుకునే వారు ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.