Begin typing your search above and press return to search.

ఆడ‌బిడ్డ‌ల క‌న్నీళ్లు చూడ‌వా చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   19 March 2017 10:29 AM GMT
ఆడ‌బిడ్డ‌ల క‌న్నీళ్లు చూడ‌వా చంద్ర‌బాబు
X
ప‌దేళ్లు విప‌క్షంలో ఉన్న వేళ‌.. చీమ చిటుక్కుమ‌న్నా వాలిపోయేవారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఆ స‌మ‌యంలో పాల‌కుల మీద అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేస్తూ.. త‌న చేతికి కానీ ప‌వ‌ర్ వ‌స్తే.. ఇలాంటివేమీ ఉండ‌వ‌ని చెప్పుకునేవారు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌వ‌ర్‌ లోకి వ‌చ్చిన చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి మ‌రో రెండు నెల‌ల్లో మూడేళ్లు కానున్నాయి. ఆయ‌న హ‌యాంలో ఇప్ప‌టికే ఎన్నో స‌మ‌స్య‌లు ఏపీని ప‌ట్టి పీడిస్తున్నా.. ఆయ‌న మాత్రం వాటిని ప‌రిష్క‌రించే విష‌యంలో అంతులేని ఆల‌స్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

అదే స‌మ‌యంలో.. పేరు ఏదైనా.. నెల‌కో ఫంక్ష‌న్ ను ప‌క్కాగా నిర్వహించేందుకు అమిత‌మైన ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించే చంద్ర‌బాబు.. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మీద ప్ర‌జ‌లు ఎన్ని పోరాటాలు చేసినా అస్స‌లు ప‌ట్టించుకోరు. మిగిలిన స‌మ‌స్య‌ల్ని ప‌క్క‌న పెట్టినా.. దాదాపు రూ.1100 కోట్ల ఆగ్రిగోల్డ్ ఇష్యూలో బాబు స‌ర్కారు ఘోరంగా ఫెయిల్ అయ్యింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ అంశం కోర్టులో ఉన్న‌ప్ప‌టికీ.. వేలాదిగా ఉన్న బాధితుల క‌ష్టాలు విన్న‌ప్పుడు.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏ చిన్న అవ‌కాశం ఉన్నా చేయాల‌నిపించ‌క మాన‌దు. తాజాగా ఆగ్రిగోల్డ్ బాధితులు విజ‌య‌వాడ‌లో ర్యాలీ నిర్వ‌హించారు.

ఈ ర్యాలీకి వంద‌లాదిగా మ‌హిళ‌లు పాల్గొన‌ట‌మే కాదు.. మీడియా ఎదుట త‌మ బాధ‌లు.. క‌ష్టాలు చెప్పుకొని బావుర‌మ‌న్నారు. ఏపీ స‌ర్కారు త‌మ మంగ‌ళ‌సూత్రాల్ని కాపాడాలంటూ వేడుకున్న వారు.. ఆగ్రిగోల్డ్ కార‌ణంగా తాము వీధుల్లో ప‌డుతున్నామ‌ని.. ఏళ్ల‌కు ఏళ్లు గ‌డుస్తున్నా.. తమ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మాత్రం ల‌భించ‌టం లేద‌ని వాపోయారు. మీడియాతో మాట్లాడే క్ర‌మంలో ప‌లువురు మ‌హిళ‌లు త‌మ దుఃఖాన్ని ఆపుకోలేక బోరుమ‌నేశారు. త‌మ స‌మ‌స్యకు ప‌రిష్కారం కోసం ఎంత‌గానో త‌ల్ల‌డిల్లుతున్నా.. ముఖ్యమంత్రి ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. ఎన్నిక‌ల వేళ‌లో ప్ర‌జ‌ల క‌ష్టాల్ని తీరుస్తామ‌ని హామీ ఇచ్చే వారు.. ఇప్పుడు ఎక్క‌డ‌కు వెళ్లారంటూ మండిప‌డ్డారు. ఆగ్రిగోల్డ్ ను న‌మ్ముకున్న కార‌ణంగా తీవ్ర మాన‌సిక వేద‌న‌ను అనుభ‌విస్తున్న విష‌యాన్ని వారు ఏక‌ర‌వు పెట్టిన వైనం క‌దిలించి వేసేలా ఉంది. ఇదంతా చూసిన‌ప్పుడు.. ఆడ‌బిడ్డ‌ల క‌న్నీళ్లు బాబును ఎందుకు క‌దిలించ‌టం లేద‌న్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/