Begin typing your search above and press return to search.

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై బలుపు రిప్లై

By:  Tupaki Desk   |   24 July 2015 11:33 AM GMT
రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై బలుపు రిప్లై
X
ప్ర‌కృతి ప్ర‌కోపానికి క‌న్నీళ్ల‌ను దిగ‌మింగుకొని.. చేసిన అప్పులు తీర్చ‌లేక‌.. పంట‌లు పండించ‌లేక‌.. దిగులుతో.. న‌మ్ముకున్న వాళ్ల‌కు అండ‌గా నిల‌వ‌లేక‌.. బ‌తుకు మీద ఆశ లేక‌.. జీవితం మీద విర‌క్తితో నిండు జీవితాన్ని అర్థాంత‌రంగా ముగించేసుకొనే అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌ల‌పై కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి రాధా మోహ‌న్ సింగ్ ఇచ్చిన బ‌లుపు స‌మాధానం చూస్తే.. మోడీ స‌ర్కారు మీద మంట పుట్ట‌క మాన‌దు.

తిరుగులేని మెజార్టీ ఇచ్చి.. ఐదేళ్లు పాలించ‌మ‌న్న పాపానికి.. త‌ల‌కెక్కిన అధికార మ‌దంతో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌న్న విష‌యాన్ని ఎలాంటి మొహ‌మాటం లేకుండా బ‌రి తెగింపుతో తాజాగా ఇచ్చిన రాత‌పూర్వ‌క స‌మాధానం చ‌దివిన వారికి షాక్ తిన‌క మాన‌రు.

గ‌డిచిన ఏడాది కాలంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న అన్న‌దాత‌ల‌కు సంబంధించి అడిగిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానాన్ని తాజాగా ఇచ్చిన మోడీ స‌ర్కారు పీక‌ల్లోతు క‌ష్టాల్ని కొనితెచ్చుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.
మెద‌డులో కాస్త గుజ్జు ఉన్నా.. అధికారులు ఇచ్చిన స‌మాధాన్ని య‌థాత‌దంగా ఇచ్చేసిన ధోర‌ణి చూసిన‌ప్పుడు.. కేంద్ర పాల‌న మీద సందేహాలు వ్య‌క్తం కాక మాన‌దు.

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల మీద పార్ల‌మెంంటు స‌భ్యుడు అడిగిన రాత‌పూర్వ‌క ప్ర‌శ్న‌కు కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి ఇచ్చిన స‌మాధానం చూస్తే.. రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌టానికి కార‌ణం.. ల‌వ్ ఎఫైర్స్‌.. డ్ర‌గ్స్ కు బానిస‌లు కావ‌టం.. న‌పుంస‌క‌త్వం.. కుటుంబ స‌భ్య‌లు.. అనారోగ్యం.. వ‌ర‌క‌ట్నం లాంటి కార‌ణాలే అని తేల్చారు.

వ్యాపం కుంభ‌కోణం.. ల‌లిత్ మోడీ వ్య‌వ‌హారంతో కిందామీదా ప‌డుతున్న మోడీ స‌ర్కారుకు.. తాజాగా వ్య‌వ‌సాయ మంత్రి ఇచ్చిన స‌మాధానం తీవ్ర క‌ల‌క‌లం రేప‌టం ఖాయంగా చెబుతున్నారు. వ్య‌వ‌సాయ మంత్రి ఇచ్చిన రాత‌పూర్వ‌క స‌మాధానం చూసిన సీనియ‌ర్ విప‌క్ష నేత‌ల నోట మాట రాని ప‌రిస్థితి. ఎంత అధికారంలో ఉంటే మాత్రం రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లాంటి మాన‌వీయ అంశాల విష‌యంలో అంత బాధ్య‌తారాహిత్యంతో స‌మాధానాలు ఇవ్వ‌టం చూస్తే.. మోడీ స‌ర్కారుకు అధికారం త‌ల‌కు బాగానే ఎక్కిన‌ట్లుగా క‌నిపించ‌క‌మాన‌దు.