Begin typing your search above and press return to search.

గుజ‌రాత్‌ లో మోడీకి బ్యాండ్ బాజా

By:  Tupaki Desk   |   28 April 2018 5:38 PM GMT
గుజ‌రాత్‌ లో మోడీకి బ్యాండ్ బాజా
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజ‌రాత్‌లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది. ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వం తీరును నిరిసిస్తూ ద‌ళితులు మ‌త మార్పిడికి సిద్ధ‌మ‌య్యారు. ఒకరు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 300 మంది ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గుజరాత్‌ లోని ఉనా తాలుకా మోటా సందియా గ్రామానికి చెందిన 300 మంది దళితులు బౌద్ధమతం స్వీకరించనున్నారు. దళిత సమాజికవర్గంపై జరిగే దాడి.. చూపే వివక్షకు వ్యతిరేకంగా బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని వీరంతా రేపు బుద్దిజంను ఫాలో అయేందుకు నిర్ణ‌యించుకున్నారు. పోరుబందర్ నుంచి బౌద్ధ మతగురువులు - స్థానిక రాజకీయ నాయకులు కార్యక్రమానికి హాజర‌వుతున్నారు.

మ‌తం మార్పిడికి సిద్ధ‌మ‌య్యే ద‌ళితులు బీజేపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ‌టం గ‌మ‌నార్హం. గతంలో దాడికి గురై బౌద్ధం స్వీకరించబోతున్న ఓ వ్యక్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ... `రెండు సంవత్సరాల క్రితం ప్రజలందరూ చూస్తుండగానే మాపై దాడి చేశారు. అప్పటి సీఎం అనందీబెన్ పటేల్ ప్రభుత్వం స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఆ హామీలు అమలు కాలేదు. మమ్మల్ని తమవాళ్లుగా ఒప్పుకోలేని మతంలో ఉండి ఏం లాభం? అందుకే బౌద్ధమతంలోకి సహచరులతో కలిసి నేను వెళ్తున్నాను` అని ఆయ‌న పేర్కొన్నాడు.

కాగా, ఈ ప‌రిణామం రాజ‌కీయ రంగు కూడా పులుముకుంది. ద‌ళితుల ప‌ట్ల బీజేపీ వివ‌క్ష‌త‌కు ఇంత భారీ స్థాయి సంఖ్య‌లో బౌద్ధాన్ని స్వీక‌రించ‌డ‌మే నిద‌ర్శ‌న‌మ‌ని గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. దాడికి గురైన ద‌ళితుల్లో ఆత్మ విశ్వాసం నింప‌డంలో బీజేపీ పాల‌కులు విఫ‌ల‌మ‌య్యార‌ని విరుచుకుప‌డుతున్నారు.