Begin typing your search above and press return to search.
ఇవాంకా వస్తే...మా ఇంటికి వెళ్లేందుకు పాస్ ఉండాలా?
By: Tupaki Desk | 24 Nov 2017 5:22 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన హైదరాబాదీలకు ఒకవైపు మోదం...మరోవైపు ఖేధాన్ని కలిగిస్తోంది. ఇవాంకా పర్యటన సందర్భంగా ఆమె ప్రసంగించే వేదిక ఉన్న దారుల్లో, పర్యటించే రహదారుల్లో అందంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. మంచిరోడ్లు...అందమైన పెయింటింగ్‌లతో రోడ్లను తీర్చిదిద్దారు. ఈ పరిణామాలు కొందరిని సంతోషంలో ముంచెత్తాయి. అయితే మరికొందరికి మాత్రం ఇవాంకా పర్యటన చేదు అనుభవాన్ని మిగులుస్తోంది.
ఇవాంకా పర్యటన ప్రసంగించే హెచ్ఐసీసీ ప్రాంతంలో, ఆమె పర్యటించే ఫలక్‌నుమాలో పాస్‌లు ఇచ్చారు. ఇవాంకా వచ్చి వెళ్లే వరకు ఆ రెండు ప్రాంతాలవారు ఇంటికెళ్ళాలన్నపాస్ ఉండాల్సిందే. `మేం కట్టుకున్న ఇంటికి....మేం నివసించే సొంత ఇంటికి పాస్ తీసుకుపోవాలా, పాస్ ఉంటేనే కానీ అనుమతించరా?` అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తుంటే...`అనుమతించరు. ఎందుకంటే. ఇవాంకా మహిమ` అని చెప్తున్నారు. `మేం లోకల్` ఇక్కడ అని ప్రశ్నిస్తే. `ఇవాంకా ఇక్కడ` అనే సమాధానం అటు నుండి వస్తుంది. అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం సలహాదారు వస్తున్న సందర్భంగా ఆమె పర్యటన వేళ హైదరాబాద్లో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తుండటంతో ఆ రెండు ప్రాంతాల వారు మాత్రం ఇబ్బందులు పడకతప్పదని అంటున్నారు.
ఇవాంకా పర్యటన దృష్ట్యా ఆమె పర్యటించే ప్రాంతాలు అమెరికా భద్రతావలయం పరిధిలోకి వెళ్ళనుండగా, ఈ సదస్సు జరిగినన్నాళ్ళు ఫలక్‌నుమాలో విందు ముగిసేవరకు పరిసర ప్రజలు రాకపోకలు సాగించాలంటే ఈ పాస్‌లు చూపించాల్సిందే. పాస్ ఉంటేనే....ఇంటికి పాస్ అయ్యేదని అంటున్నారు. అయితే..ఇవాంకా వచ్చే ఒక రోజు ముందు హెచ్ఐసీసీ - ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసర ప్రజలకు ప్రత్యేక పాసుల జారీచేయడంపై పెద్ద ఎత్తున నిరసన వస్తున్న సంగతి నిజమంటున్నారు.