Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ కు కరోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   1 Oct 2020 5:35 PM GMT
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ కు కరోనా పాజిటివ్
X
కరోనా మహమ్మారి జోరు ఇండియాలో కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు కూడా కరోనా భారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌కు కరోనా పాజిటివ్ అని నిర్థరణ అయింది. ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అహ్మద్ పటేల్ గురువారం ఇచ్చిన ట్వీట్‌ లో తనకు కరోనా పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో తనతో కలిసి సంచరించినవారు స్వీయ ఐసొలేషన్ ‌లో ఉండాలని కోరారు. ఇదిలావుండగా మన దేశంలో కరోనా వ్యాధి నుంచి కోలుకునేవారి సంఖ్య పెరుగుతోంది. రికవరీ రేటు 83.53 శాతం ఉన్నట్లు వెల్లడైంది. కాంగ్రెస్‌ నేతలైన అభిషేక్‌ సింఘ్వీ, తరుణ్‌ గోగొయ్‌లకు కూడా కరోనా సోకింది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీకి కూడా కరోనా బారినపడ్డారు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 63 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 86,821 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,12,585 కి చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 1,181 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 98,678 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 52,73,202 మంది కోలుకున్నారు. 9,40,705 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.