Begin typing your search above and press return to search.

అహ్మదాబాద్ పోలీసుల్ని ఫాలో కండి!!

By:  Tupaki Desk   |   10 Nov 2016 10:25 AM GMT
అహ్మదాబాద్ పోలీసుల్ని ఫాలో కండి!!
X
పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో చిత్రవిచిత్రమైన పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘పెద్ద నోట్ల రద్దు’’ అన్నది ఒక్క మాటగా కనిపించినప్పటికీ దేశంలోని ఎక్కడెక్కడో ఉన్న అందరిని ఏకం చేసి.. ప్రభావం చూపించేసింది. దీంతో.. బోలెడన్ని పరిణామాలు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకూ పెద్దనోట్లు చేతిలో పెట్టుకొని దర్జాగా ఉన్న వాళ్లంతా ఈ రోజు బిక్కుబిక్కుమనే పరిస్థితి. పెద్దనోట్ల రద్దుతో రోజువారీ జీవితం మీద తీవ్ర ప్రభావం పడటమే కాదు.. చాలా అంశాలకు సంబంధించి సరికొత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది.

నిత్యం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి పోలీస్ శాఖ చలానాలు విధించటం.. పెద్ద ఎత్తున జరిమానాలు విధించటం మామూలే. అయితే.. పెద్దనోట్ల రద్దుతో చిల్లర సమస్యలు ఎదుర్కోవటంతో పాటు.. చేతిలో ఉన్న పెద్ద నోట్లు మార్కెట్లో చెల్లుబాటు కాని పరిస్థితి. దీంతో.. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.

ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించే వారికి రూ.500.. రూ.వెయ్యి చొప్పున విధించే ఫైన్లను మినహాయించాలని నిర్ణయించారు. పెద్ద నోట్లకు బదులుగా కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చే వరకూ చిన్న చిన్న ఉల్లంఘనల విషయంలో ఎలాంటి జరిమానా విధంచకూడదని నిర్ణయించారు. దేశంలో నోట్ల చలామణి సాధారణ పరిస్థితి చేరుకునే వరకూ చలానాల విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. అహ్మదాబాద్ పోలీసుల నిర్ణయంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదేరీతిలో హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. ప్రజలు సైతం ఎవరికి వారు ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించకుండా ఎవరికి వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/