Begin typing your search above and press return to search.
‘ఛాయ్ పే చర్చా’ వేదికను క్లోజ్ చేసేశారు
By: Tupaki Desk | 22 Aug 2016 2:39 PM ISTప్రధాని మోడీ మాట చెప్పిన వెంటనే గుర్తుకు వచ్చే ఐదు అంశాల్లో ‘‘ఛాయ్ పే చర్చా’’ ఒకటి తప్పకుండా ఉంటుంది. అలాంటి కార్యక్రమానికి వేదికగా నిలిచిన కట్టడాన్ని అధికారులు మూసేయటం ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ముందు.. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయనపై చాలానే సందేహాలు ఉండేవి. వాటిని పటాపంచలు చేసిన అంశాల్లో ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని చెప్పుకోవాలి.
దీని కోసం నాడు బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ అద్భుతమైన ఐడియా ఒకటి వేశారు. గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ లోని ఇస్కాన్ గాంతియా టీ షాపు లో ఈ ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సూపర్ హిట్ కావటమే కాదు.. మోడీ ఇమేజ్ ను అమాంతంగా మార్చేసింది.
ఆ తర్వాత మోడీ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి మోడీ నిర్వహించిన ఛాయ్ పే చర్చా వేదిక అయిన ఇస్కాన్ గాంతియా టీ షాపు ఫేమస్ అయిపోయింది. ఈ టీ స్టాల్ కు జనాలు తండోప తండాలు రావటంతో ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూ మొదలైంది. దీంతో.. అధికారులు ఈ భవనానికి సంబంధించిన అనుమతులు గట్రా లాంటివి చెక్ చేసి చూస్తే.. షాపు పెట్టుకోవటానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. చట్టం తన పని తాను మొదలు పెట్టటంతో మోడీ ఛాయ్ పే చర్చకు వేదిక నిలిచిన టీ స్టాల్ ను క్లోజ్ చేసేశారు. ప్రధాని మోడీకి వేదికకు అనుమతులు లేకపోవటం ఒక విశేషమైతే.. ఆ విషయాన్ని ఇంతకాలానికి అధికారులు గుర్తించటం ఏమిటో..?