Begin typing your search above and press return to search.
అమ్మ లేకున్నా ఆమె కుర్చీకి మాత్రం..
By: Tupaki Desk | 30 Dec 2016 4:28 AM GMTఅమ్మగా తమిళుల మనసుల్లో రిజిష్టర్ చేసుకొని తన దారిన తాను వెళ్లి పోయిన జయలలితకు సంబంధించిన ఆసక్తికర అంశాలెన్నో. తనదైన ప్రపంచంలో ఉండటం.. ఎవరిని దగ్గరకు రానివ్వకపోవటం.. గుట్టుగా వ్యవహరించటం.. అంతా తానై వ్యవహరించటం లాంటివెన్నో ఆమెలో కనిపిస్తాయి. ఆమె ఎంత ప్రత్యేకమైన అధినేత్రి అంటే.. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో తాను కూర్చునే కుర్చీని చెన్నై నుంచి తీసుకెళ్లేవారు.
ప్రధానమంత్రితో భేటీ అయినా.. తాను కూర్చునే కుర్చీలోనే కూర్చునేవారు తప్పించి.. ఎవరో వేసిన కుర్చీలో కూర్చునేందుకు ససేమిరా అనేవారు. అలాంటి వెరైటీలు అమ్మ దగ్గర చాలానే ఉంటాయి. మరి.. అమ్మ లేని ఇప్పుడు.. అమ్మ ఎంతో అభిమానంగా చూసుకున్న ఆ కుర్చీ మాటేమిటి? అన్న సందేహానికి తాజాగా సమాధానం లభించింది.
గురువారం జరిగిన అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం సందర్భంగా అమ్మ స్థానం అమ్మదేనన్న విషయాన్ని స్పష్టం చేసేలా ఏర్పాట్లు చేశారు. వేదిక మధ్యలో అమ్మ కుర్చునే కుర్చీని ఏర్పాటు చేసి.. అందులో అమ్మ ఫోటోను పెట్టి.. పూలదండలతో అలంకరించారు. కుర్చీకి చెరోవైపు ముఖ్యనేతలు కూర్చునే ఏర్పాటు చేశారు. ఇదంతా చూసినప్పుడు.. అమ్మ బతికి ఉన్నప్పుడు.. పార్టీ సమావేశాల్ని తన కనుసన్నల్లో ఎలా నిర్వహించారో.. ఇంచుమించు అదే రీతిలో నిర్వహించారని చెప్పాలి. అమ్మ లేకున్నా.. అమ్మ స్థానాన్ని భర్తీ చేసేలా.. ఆమె కుర్చీ వ్యవహరించిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/