Begin typing your search above and press return to search.

వెల్లూరు లోక్‌ స‌భ ఎన్నిక రిజ‌ల్ట్‌... ఆ పార్టీకి బిగ్ షాక్‌

By:  Tupaki Desk   |   9 Aug 2019 11:52 AM GMT
వెల్లూరు లోక్‌ స‌భ ఎన్నిక రిజ‌ల్ట్‌... ఆ పార్టీకి బిగ్ షాక్‌
X
తమిళనాడులోని వెల్లూరు లోక్‌ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిరేపిన ఈ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అన్నాడీఎంకే అభ్య‌ర్థి ప‌రాజ‌యం పాల‌య్యారు. డీఎంకే అభ్యర్థి కథిర్ ఆనంద్ తన సమీప అన్నాడీఎంకే అభ్యర్థి షణ్ముగంపై 8,141 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నెల 5వ తేదీన వెల్లూరు లోక్‌ స‌భ సీటుకు ఎన్నిక‌లు జ‌రిగాయి. వాస్త‌వానికి ఈ ఏప్రిల్‌- మే నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల‌తో పాటే ఈ సీటుకు కూడా ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.

ఎన్నిక‌ల వేళ డీఎంకే అభ్య‌ర్థికి చెందిన ఓ గిడ్డంగిలో భారీగా న‌గ‌దు క‌ట్ట‌లు ల‌భ్య‌మ‌య్యాయి. దీంతో అక్క‌డ రాజ‌కీయ ప‌క్షాలు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో రాష్ట్ర‌ప‌తి రామ్‌ నాథ్ కోవింద్ అక్క‌డ ఎన్నిక ర‌ద్దు చేశారు. దీంతో ఈ స్థానానికి ఇప్పుడు ఎన్నిక నిర్వ‌హించారు. ఈనెల 5న వెల్లూరు లోక్‌ సభ స్థానానికి పోలింగ్ జరుగగా, ఇవాళ ఉదయం 8 గంటలకు స్థానిక ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు మొదలైంది. అయితే డీఎంకేకు వ‌న్‌ సైడ్‌ గా విజ‌యం ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. అధికార అన్నాడీఎంకే గ‌ట్టిపోటీ ఇచ్చింది.

చివ‌ర‌కు హోరాహోరీ పోరులో అధికార డీఎంకేకే షాక్ త‌గ‌ల‌కు త‌ప్ప‌లేదు. చివ‌ర‌కు 8 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో డీఎంకే గెలిచింది. డీఎంకే విజయం సాధించడంతో లోక్‌ సభలో డీఎంకే ఎంపీల బలం 24కు చేరింది. ఈ విజ‌యంతో రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ విజ‌యంతో త‌మిళ‌నాడు భ‌విష్య‌త్ సీఎం స్టాలిన్ అన్న విష‌యం మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు లెక్క‌లు వేసుకుంటున్నాయి.