Begin typing your search above and press return to search.
జైల్లో చిన్నమ్మ ఎలా ఉన్నారో చెప్పారు
By: Tupaki Desk | 22 May 2017 8:36 AM GMTఓపక్క పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా చెప్పినప్పటికీ.. పార్టీ కార్యాలయం నుంచి ఫోటోలు తీసేసినట్లు చెప్పినప్పటికీ.. తమిళనాడు అధికారపక్ష నేతలు జైల్లోని చిన్నమ్మ దర్శనం కోసం విపరీతంగా తపిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమై.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళను కలుసుకునేందుకు అధికార అన్నాడీఎంకేకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రయత్నించినా.. వారికి అవకాశం లభించలేదు.
తాజాగా ఐదుగురు అన్నాడీఎంకే నేతలకు ఆ అరుదైన అవకాశం లభించింది. చిన్నమ్మను జైల్లో కలిసే ఛాన్స్ కొట్టేసిన నేతల్లో మంత్రి బాలకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యేలు.. కరుణాస్.. తంగ తమిళ్ సెల్వన్.. వెట్రివేల్.. మాజీ మంత్రి బీవీ రమణ ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతోపాటు.. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న అంశాల్ని వివరించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. జైల్లో చిన్నమ్మ దర్శనం లభించటంతో ఐదుగురు ప్రజాప్రతినిధుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయినట్లుగా చెబుతున్నారు. ఈ బంపర్ ఆఫర్‌ను తాము కూడా చేజిక్కించుకోవటానికి అన్నాడీఎంకే ప్రజాప్రతినిధులు పలువురు ఊవ్విళ్లూరుతున్నారు. మరి.. వారికి చిన్నమ్మ ఎంతమేర అవకాశం ఇస్తుందన్నది డౌటే. మరోవైపు.. జైల్లో చిన్నమ్మను కలిసిన వైనాన్ని పార్టీ నేతలు చెబుతూ.. ఆమె ఎలా ఉందో చెబుతున్నారు.
జైల్లో ఉన్నప్పటికీ శశికళలో ఆత్మస్థైర్యం ఏ మాత్రం తగ్గలేదంటున్నారు. ఆమె మనోధైర్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకుంటే.. ఆహారం సరిగా లేనందున సన్నబడినట్లుగా ఓ ఎమ్మెల్యే వెల్లడించారు. అయితే.. చిన్నమ్మ తాజా దర్శనం మొత్తం కూడా నాటకమేనని చెబుతున్నారు. ఓవైపు పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా చెబుతూనే.. మరోవైపు ఆమె దర్శనం కోసం పాకులాడుతున్న వైనాన్ని వారు సూటిగా ప్రస్తావిస్తున్నారు. నిజమే.. లాజిక్ అయితే సరిపోయింది.