Begin typing your search above and press return to search.

గెట్ అవుట్ ర‌వి.. ఇంతక‌న్నా అవ‌మానం ఏంటి?

By:  Tupaki Desk   |   11 Jan 2023 4:30 PM GMT
గెట్ అవుట్ ర‌వి.. ఇంతక‌న్నా అవ‌మానం ఏంటి?
X
గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ రానురాను తీవ్ర వివాదంగా మారిపోతోంది. తాజాగా త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రాష్ట్ర విడిచి పెట్టి పోవాలంటూ.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా చెన్నై వ్యాప్తంగా `గెట్ అవుట్ ర‌వి` నినాదంతో కూడిన వాల్ పోస్ట‌ర్లు ప్ర‌త్య‌క్ష మయ్యాయి. దీంతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత క‌ల‌క‌లం రేపింది. ఇదిలావుంటే.. మ‌రోవైపు గ‌వ‌ర్న‌ర్ ర‌వి కూడా.. ప్ర‌భుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అవుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా ఆయ‌న సంకాంత్రి సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించే `టీ పార్టీ`(హై టీ) ఆహ్వానపత్రికలో త‌మిళ‌నాడు పేరును ‘తమిళగం’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ఆహ్వాన ప‌త్రిక పైన ఇక గతేడాది తమిళనాడు అధికారిక ముద్ర (శ్రీవిల్లిపుత్తూరు ఆలయ రాజగోపురం) ఉండగా తాజా పత్రికలో కేంద్ర ప్రభుత్వం ఉపయోగించే `మూడు సింహాల` గుర్తును ముద్రించారు. ఇది మ‌రింత వివాదంగా మారింది.

ఇటీవ‌ల ఆయ‌న త‌మిళ‌నాడు రాష్ట్రాన్ని తమిళనాడు అని పిలువకూడదని, తమిళగం అని పిలవడమే సమంజసమని చెప్పుకొచ్చారు. దీనిపై అధికార‌, విప‌క్షాలు స‌హా భాషా ప్రేమికులు కూడా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. గ‌వ‌ర్న‌ర్ మాత్రం త‌న పంతం త‌ను నెగ్గించుకునే ప‌నిలో ఉన్నారు.

ఇదిలావుంటే.. అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల ప్రారంభం రోజున‌.. ప్ర‌సంగంలోనూ ప్ర‌భుత్వం రాసింది చ‌ద‌వ‌కుండా.. త‌న ఇష్టాను సారం గ‌వ‌ర్న‌ర్ చ‌ద‌వ‌డంపై సాక్షాత్తూ సీఎం స్టాలిన్‌.. స‌భ‌లోనే విరుచుకుప‌డ్డారు. దీంతో ఖండన తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక, ఈ వివాదం రాజుకున్న నేప‌థ్యంలో గవర్నర్‌ను రీకాల్‌ చేయాలంటూ డీఎంకే, దాని మిత్రపక్షాల నాయకులు ఆందోళనలు చేపట్టారు.

ఈ క్ర‌మంలోనే చెన్నై వ్యాప్తంగా `గెట్ అవుట్ ర‌వి` నినాదంతో కూడిన పోస్ట‌ర్లు ద‌ర్శ‌న మిస్తున్నాయి. అయితే.. వీటిని ఎవ‌రు అంటించారు? అనేది మాత్రం స‌స్పెన్స్‌గా ఉంది. ప్ర‌భుత్వ వ‌ర్గాలు కూడా గ‌వ‌ర్న‌ర్‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం లేద‌ని.. తెలుస్తోంది. మొత్తంగా.. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌కు ఘోర అవ‌మానం ఎదుర‌వుతోంద‌ని.. ఆయ‌న గౌర‌వంగా త‌ప్పుకోవ‌డ‌మే బెట‌ర్ అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.