Begin typing your search above and press return to search.
రజనీకాంత్ పార్టీలోకి రెడీ టు జంప్
By: Tupaki Desk | 29 May 2017 12:25 PM GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు దాదాపు కన్ఫర్మయిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా కన్ఫర్మ్ చేస్తున్నాయి. పార్టీ నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీని ఎలా నిర్మించాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అనే దానిపై కసరత్తు మొదలైంది. దీనికోసం బెంగళూరులోని ఓ ఏజెన్సీ సేవలను రజనీ తీసుకుంటున్నారు.
తమిళ ఓటర్ల నాడిని అధ్యయనం చేయడం, ఓటర్లను ఆకట్టుకోవడానికి కావాల్సిన అజెండాను రూపొందించడం తదితర కార్యాలను ఈ ఏజెన్సీ చేస్తుంది. మరోవైపు, ఇతర పార్టీల్లో ఉన్న ప్రముఖ నేతలను ఆకర్షించడంపై రజనీ, ఆయన సలహాదారులు దృష్టిని సారించారట. ఎవరెవరిని పార్టీలోకి తీసుకోవాలనే విషయంలో ఇప్పటికే లిస్టు రెడీ చేశారని తెలుస్తోంది.
కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో రజనీ పార్టీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుండడం... అన్నా డీఎంకేలో పరిస్థితులు అయోమయంగా ఉండడంతో చాలామంది నేతలు రజనీవైపు చూస్తున్నట్లు టాక్. ఇమీడియట్ గా రజనీ పార్టీలో చేరేవారిలో అన్నాడీఎంకేకు చెందిన పాండ్యరాజన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. రజనీ పార్టీ పెట్టడమే తరువాయి ఆయన చేరిపోతారని తమిళనాట వినిపిస్తోంది. అన్నాడీఎంకే ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా చేసిన పాండ్యరాజన్ ఆ తర్వాత పన్నీర్ సెల్వం గూటికి చేరారు. ఇంకా పలువురు నేతలు రజనీ కోసం ఎదురుచూస్తున్నారని... రజనీ, బీజేపీ కాంబినేషన్ తమిళనాడు వర్కవుట్ అవుతుందని రాజకీయ వర్గాల్లో అంచనాలు కనిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/