Begin typing your search above and press return to search.
చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఆ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్
By: Tupaki Desk | 6 Aug 2017 4:56 PM GMTఒక ఒరలో రెండు కత్తులు పట్టవని చెబుతుంటారు. కానీ.. చిత్రంగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో తాజాగా ఉప్పు.. నిప్పుల మాదిరి ఉండే మూడు వర్గాలకు చెందిన పాలకపక్ష పార్టీకి చెందిన నేతలు కలవటం ఒక ఎత్తు అయితే.. వారంతా కలిసి మాట్లాడుకోవటం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. తమిళనాడు రాజకీయాల్లో అలజడిని రేపి.. సరికొత్త ఊహాగానాలకు తెర తీసే సన్నివేశం చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఆవిష్కృతమైంది.
ఇంతకీ ఏం జరిగిందంటూ.. అన్నాడీఎంకేకు చెందిన మూడు వర్గాల (పళని.. పన్నీర్.. దినకరన్)కు చెందిన నేతలు ఒకేచోట కలవటం ఒక ఎత్తు అయితే.. తమ మధ్యనున్న విభేదాల్ని వదిలి వారు మాట్లాడుకోవటం అందరి దృష్టిని ఆకర్షించింది. వీరంతా కలిసి మాట్లాడుకోవటం మొదలు కాగానే.. అన్నాడీఎంకే వర్గాల మధ్య విలీన ప్రక్రియ వేగం అందుకుందన్న వాదనలు మొదలయ్యాయి.
అయితే.. ఇవన్నీ ఊహాగానాలే తప్పించి.. ఇందులో నిజం లేదని తేల్చేశారు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. తిరుచిరాపల్లికి వెళ్లేందుకు అన్నాడీఎంకే మూడు వర్గాలకు చెందిన నేతలు చెన్నై ఏయిర్ పోర్ట్ కి రావటం.. వారంతా ఒకే విమానంలో ప్రయాణిస్తుండటంతో వారి మధ్య మాటలు కలిశాయి. వాస్తవానికి.. అమ్మ బతికి ఉన్నంతవరకూ అంతా ఒకే పార్టీకి చెందిన వారే. అమ్మ మరణం తర్వాతే చీలికలైన అన్నాడీఎంకే నేతలు.. పాత పరిచయంతో కులాసా కబుర్లు చెప్పుకున్నట్లుగా చెబుతున్నారు.
నేతల మధ్య సాగుతున్న సంభాషణలకు బయట ఊహాగానాలువేరుగా రావటంతో పన్నీరు సెల్వం అలెర్ట్ అయ్యారు. మూడు వర్గాల నేతలు కాకతాళీయంగా మాత్రమే కలిశామని.. తమ మధ్య విలీన చర్చలు ఏమీ జరగలేదని..అలాంటి ప్రయత్నం జరగలేదని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక.. తాము మాట్లాడుకున్న అంశం గురించి వివరిస్తూ.. ప్రజలు ఎదుర్కొంటున్న నీళ్ల కష్టాల గురించి తమ మధ్య చర్చకు వచ్చినట్లుగా వెల్లడించారు.