Begin typing your search above and press return to search.
ఇప్పటికైతే చిన్నమ్మ సీఎం కారట
By: Tupaki Desk | 5 Feb 2017 7:02 AM GMTఅదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్లుగా మారింది తమిళ రాజకీయం. అమ్మ మరణం తర్వాత చిన్నమ్మ సీఎం సీట్లో కూర్చునే విషయం మీద అదే పనిగా మీడియాలో హడావుడి చోటు చేసుకోవటం ఇదే తొలిసారి కాదు. ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్నా.. సీఎం కుర్చీలో చిన్నమ్మ కూర్చునేందుకే పావులు కదుపుతున్నట్లుగా వార్తలు వచ్చేస్తున్న పరిస్థితి. తాజాగా ఇలాంటిదే చోటు చేసుకుంది.
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో చిన్నమ్మ ఒక భేటీని నిర్వహించాలని నిర్ణయించటంతో.. దీన్ని శాసనసభాపక్ష సమావేశంగా భావించేసిన మీడియా.. ఇంకేముంది చిన్నమ్మను సీఎం కుర్చీలో కూర్చోబెట్టటానికి ముహుర్తం పెట్టేశారంటూ వార్తలు ఇచ్చేశారు. దీనికి కౌంటర్ అన్నట్లుగా పన్నీరు వర్గం సీఎం తన పదవికి రాజీనామా చేయరన్న మాటను ప్రచారం చేసింది. దీంతో.. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
మీడియాలో వరుస పెట్టి వస్తున్న కథనాల నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేతలు రియాక్ట్ అయ్యారు. తాజాగా నిర్వహిస్తున్న సమావేశం చిన్నమ్మను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఉద్దేశించిన భేటీ కాదని.. కేవలం పార్టీ ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన భేటీగా స్పష్టం చేశారు. చిన్నమ్మకు సీఎం పదవిని అప్పగించే విషయమై వేరుగా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ అయితే.. ఇప్పటికిప్పుడు సీఎం అయ్యే ఛాన్స్ అయితే లేదని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/