Begin typing your search above and press return to search.
చిన్నమ్మకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న మంత్రులు
By: Tupaki Desk | 2 Jan 2017 4:00 AM GMTపవర్ మహా చెడ్డది. అది మనుషుల్ని ఉత్తినే ఉండనీయదు. దాన్ని సొంతం చేసుకోవాలన్న తపన కలిగేలా చేస్తుంది. అందీఅందనట్లుగా.. చిక్కిచిక్కనట్లుగా ఉండే పవర్ ను మొత్తంగా సొంతం చేసుకోవాలని తెగ తపిస్తుంటారు. తాజాగా అలాంటి వైఖరినే గుట్టుచప్పుడు లేకుండా ప్రదర్శిస్తున్నారు తమిళనాడు అధికారపక్ష చీఫ్.. చిన్నమ్మగా రూపాంతరం చెందిన శశికళ.
అమ్మ మరణం తర్వాత చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల దృష్ట్యా.. అన్నాడీఎంకే రథసారధిగా పగ్గాలు చేపట్టిన శశికళ.. దీన్ని ఇంతటితో వదిలేయకుండా.. మరింత ముందుకు వెళ్లాలన్న భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే అన్నాడీఎంకేకు చెందిన మంత్రుల చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు.
పార్టీ పగ్గాలు చేపట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే.. ముఖ్యమంత్రి పదవిని చిన్నమ్మ చేపట్టాలంటూ ముగ్గురు మంత్రులు గళం విప్పటం గమనార్హం. కొత్త సంవత్సరం రోజున.. మెరీనా బీచ్ దగ్గరున్న అమ్మ సమాధి వద్దకు వెళ్లి.. అమ్మకు నివాళులు అర్పించిన ముగ్గురు మంత్రులు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్నమ్మ సీఎం కావాలని.. ఆమె ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలన్న ఆశను.. ఆకాంక్షను వ్యక్తం చేయటం గమనార్హం.
పార్టీ పగ్గాలు చేపట్టిన సమయంలో చిన్నమ్మ చేసిన ప్రసంగంలోని అంశాల్ని ప్రస్తావించిన ఈ ముగ్గురు మంత్రులు (ఆర్పీ ఉదయకుమార్.. కడంబూరు రాజు.. సేవూరు రాజు) పార్టీని కంటికి రెప్పలా కాపాడతానని.. పది కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం పాటు పడతానని ప్రకటించటాన్ని ప్రస్తావించిన ఆమెను మంత్రులే ముఖ్యమంత్రిగా చిన్నమ్మ బాధ్యతలు స్వీకరించాలని కోరటం ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు చిన్నమ్మకు అవసరమైన గ్రౌండ్ ను కొందరు మంత్రులు వ్యూహత్మకంగా వ్యవహరిస్తుంటే.. మరికొందరు నేతలు మాత్రం చిన్నమ్మకు వ్యతిరేకంగా పలువురు పార్టీ ప్రముఖులు తమ పదవులకు రాజీనామా చేయటం గమనార్హం. చిన్నమ్మ శశికళ పార్టీ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టటాన్ని తప్పు పట్టిన వీరు.. అమ్మ మేనకోడలు దీపకు మద్దతుగా నిలవటం గమనార్హం. ఒకవైపు చిన్నమ్మకు సీఎం పగ్గాలు ఇవ్వాలంటూ వరుస ప్రకటనల్ని మంత్రులు చేస్తుంటే.. ఆమెను వ్యతిరేకిస్తూ కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టటం చూస్తే.. అమ్మకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న మంత్రులు మరింత కష్టపడాల్సిందేనని చెప్పక తప్పదు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత సన్నిహితురాలు శశికళ ఎన్నికైనా.. దివంగత నాయకురాలికి నిజమైన రాజకీయ వారసురాలు ఆమె మేనకోడలు దీపా జయకుమారేనంటూ పార్టీలోని అసంతృప్తవర్గాలు స్పష్టంచేస్తున్నాయి. దివంగత పురచ్చితలైవికి నిజమైన రాజకీయ వారసురాలు ఆమె మేనకోడలేనంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గ్రూపులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే తిరుచిరాపల్లి జిల్లాలో దీపకు మద్దతుగా ఒక ఫోరం ఏర్పడగా.. తాజాగా కోయంబత్తూరులోనూ ఇటువంటిదే ఏర్పడింది.
దీపా పెరవాయి పేరిట దాదాపు వంద మంది అన్నాడీఎంకే కార్యకర్తలు ఆదివారం భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిలో మాజీ ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్ - జయలలితతోపాటు దీప ఫొటోలు పెట్టారు. అనంతరం దీపకు మద్దతుగా నినాదాలు చేశారు. జయలలితకు నిజమైన రాజకీయ వారసురాలు దీపజయకుమారేనని తేల్చి చెప్పారు. సేలం - తిరుచిరాపల్లి జిల్లాల్లో ఇప్పటికే శశికళకు వ్యతిరేకంగా - దీపకు అనుకూలంగా గ్రూపులు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. తిరుచిరాపల్లిలో అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నానికి పోటీ అన్నట్లు రెండు గులాబీ పువ్వుల చిహ్నాన్ని ప్రదర్శించారు. ఇదిలా ఉంటే తిరుపూర్లోని కొన్ని ప్రాంతాల్లో శశికళ చిత్రాలు ఉన్న బోర్డులను కొందరు ధ్వంసం చేశారు. శశికళ పార్టీ పగ్గాలు స్వీకరించడాన్ని నిరసిస్తూ కడలూరులో నల్లజెండాలతో ప్రదర్శన కూడా జరిగింది. దీంతో పార్టీలో చాపకింద నీరులాగా చిన్నమ్మ వ్యతిరేకవర్గం ముందుకు సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/