Begin typing your search above and press return to search.

జ‌య‌ల‌లిత‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి!!!

By:  Tupaki Desk   |   29 Dec 2016 9:49 AM GMT
జ‌య‌ల‌లిత‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి!!!
X
మామూలు సినిమాకు, త‌మిళ సినిమాకు తేడా చెప్ప‌మంటే ఎవ‌రైనా చెప్పే మాట ఒక్క‌టే. ఓవ‌ర్ యాక్ష‌న్‌. త‌మిళ సినిమాల్లో అతిశ‌యోక్తులు ఎక్కువ‌గా ఉంటాయంటారు. సినిమాల్లోనే కాదు అన్ని విష‌యాల్లోనూ అక్క‌డ వారు భారీ రేంజిలోనే ఊహిస్తారు. తాజాగా త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇవ్వాలంటూ అన్నా డీఎంకే స‌ర్వ‌స‌భ్య స‌మావేశం తీర్మానించ‌డంపైనా ఇలాంటి అభిప్రాయ‌మే వ్య‌క్త‌మ‌వుతోంది.

త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు, అన్నా డీఎంకే కార్య‌క‌ర్త‌లు జ‌య‌ల‌లిత‌ను ఎంత‌గా అభిమానిస్తారో తెలిసిందే. అమ్మగా పిలుచుకునే జ‌య కంటే ప్ర‌పంచంలో ఇంకెవ‌రూ గొప్పోళ్లు కార‌న్న‌ది వారిలో చాలామంది న‌మ్మ‌కం. త‌మిళ‌నాడు వ‌ర‌కు అమ్మ కీర్తి ప్ర‌తిష్ఠ‌లు, గొప్ప‌ద‌నాన్ని త‌క్కువ చేయ‌లేం. అంతేకాదు.. దేశంలోనూ ఆమె ముద్ర ఉంది. ఆమె త‌మిళ‌నాడులో ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను ఇత‌ర సీఎంలు అడాప్టు చేసుకోవ‌డం వ‌ల్ల ఇత‌ర రాష్ట్రాల్లోనూ ప‌రోక్షంగా ఆమెవ‌ల్ల కోట్లాది మందికి మేలు జ‌రిగింద‌ని చెప్పొచ్చు. కానీ... నోబెల్ శాంతి బ‌హుమ‌తికి, జ‌య‌ల‌లిత‌కు ఏంటి సంబంధ‌మ‌న్న ప్ర‌శ్న మాత్రం ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

జయలలిత మరణం తర్వాత తొలిసారి జ‌రిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణ‌యం దేశాన్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. అభిమానం ఈ స్థాయిలో ఉంటుందా అనుకుంటున్నారు. కాగా ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 14 తీర్మానాలను ఆమోదించారు. ఇప్పటి దాకా ఉన్న నిబంధనలను మార్చి, ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల నిర్వ‌హించాల‌ని.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల‌ని.. జయలలితకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని.. పార్లమెంటులో జయలలిత కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని.. జయలలితకు నోబెల్ శాంతి పురస్కారం దక్కేలా ప్రయత్నించాల‌ని.. జయలలిత పుట్టిన రోజును 'జాతీయ రైతు దినోత్సవం'గా ప్రకటించాల‌ని తీర్మానించారు. ఇలా మొత్తం తీర్మానాల‌న్నీ అమ్మ చుట్టూనే తిరిగాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/