Begin typing your search above and press return to search.

అమ్మ ఆసుప‌త్రి బిల్లు పే చేసేదెవ‌రంటే?

By:  Tupaki Desk   |   17 Jun 2017 7:15 AM GMT
అమ్మ ఆసుప‌త్రి బిల్లు పే చేసేదెవ‌రంటే?
X
తీవ్ర అనారోగ్యానికి గురై రెండు నెల‌ల పాటు చెన్నై అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందిన దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఆసుప‌త్రి బిల్లుపై ఆస‌క్తిక‌ర స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న జ‌య‌ల‌లిత.. ప‌ద‌విలో ఉండ‌గానే అనారోగ్యానికి గురైన నేప‌థ్యంలో ఆమెకు చేసిన వైద్య ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని భావించారు.

ఇదే రీతిలో వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. ఇందుకు భిన్న‌మైన నిర్ణ‌యాన్ని అమ్మకు చెందిన అన్నాడీఎంకే (అమ్మ‌) పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. అమ్మ అనారోగ్యానికి చేసిన వైద్య ఖ‌ర్చుకు అయిన రూ.6 కోట్ల మొత్తాన్ని అన్నాడీఎంకే (అమ్మ‌) పార్టీ భ‌రిస్తుంద‌ని తాజాగా పేర్కొంది. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి రూ.6 కోట్ల చెక్కును రాష్ట్ర ఆరోగ్య‌శాఖా మంత్రికి అందించారు.

పార్టీ నిధుల నుంచే అమ్మ ఆసుప‌త్రి బిల్లును చెల్లిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. తాజా ప‌రిణామంతో అమ్మ ప‌ట్ల త‌మ‌కున్న అభిమానాన్ని అన్నాడీఎంకే (అమ్మ‌) ప‌క్షం ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా చెప్ప‌క‌త‌ప్ప‌దు. అధికార పార్టీకి దూరమైన ప‌న్నీరు వ‌ర్గంపై పైచేయి సాధించేందుకు ఈ చెల్లింపు లాభం చేకూరుస్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏమైనా రూ.6 కోట్ల బిల్లును పార్టీ చెల్లించ‌టం ఆస‌క్తిక‌ర‌మే. కోట్లాది మంది ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకొని.. ముఖ్య‌మంత్రిస్థానంలో ఉన్న అధినేత ఆసుప‌త్రి బిల్లుకు ప్ర‌జల సొమ్ము వాడ‌క‌పోవ‌టంలో మ‌ర్మ‌మేంది? అన్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/