Begin typing your search above and press return to search.
అలాంటి వేళ పన్నీర్ రాజీనామా సంతకం
By: Tupaki Desk | 12 Feb 2017 10:02 AM GMTవిధేయతకు మారుపేరుగా ఉండే పన్నీర్ సెల్వం చిన్నమ్మ విషయంలో ఎందుకంత మొండిగా ఉన్నారు? తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకూ అందరికి తెలిసిన పన్నీర్ వైఖరికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? లాంటి ప్రశ్నలకుసమాధానాలు వెతికితే ఆసక్తికర సమాధానాలు లభించటమే కాదు.. మరీ.. అంత దారుణ అవమనాన్ని పన్నీర్ ఎందుర్కొన్నారా? అని ఫీలవ్వాల్సిందే.
అన్నాడీఎంకే పార్టీకి పెద్దదిక్కుగా.. ఎంజీఆర్ నాటి నుంచి పార్టీని కాసుకొని ఉండే పార్టీ ప్రెసీడియం కమిటీ ఛైర్మన్ మధుసూదనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దరికంగా వ్యవహరించే ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఎందుకు రాజీనామా చేయల్సి వచ్చిందన్న విషయాలకు సంబంధించి సంచలన విషయాల్ని వెల్లడించారు.
‘‘పార్టీకి వ్యతిరేకంగా మేమేం చేయలేదు. పార్టీ ప్రెసిడెంట్ ను కాబట్టే పన్నీర్ వద్దకు వెళ్లాను. శశికళ తాత్కాలిక జనరల్ సెక్రటరీ మాత్రమే. ఆమె ఆదేశాలు చెల్లుబాటు కావు. ఆమె కుటుంబం మొత్తం పార్టీలోకి రావాలని చూస్తోంది. వారంతా రాజకీయం చేస్తున్నారు. ఏంజీఆర్ హయాం నుంచి పార్టీలో ఉన్నాం. శశికళను జనరల్ సెక్రటరీగా నేను రికమెండ్ చేశాను. పార్టీ ఫండ్ కి సంబందించిన వివరాలన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి. పార్టీ నడవాలంటే ఫండ్స్ కావాలి. అందుకే.. ఆమెకు బాధ్యత కలిగిన పదవి ఇవ్వాలని భావించి ముందుగా కట్టబెట్టాం’’ అని చెప్పారు.
అమ్మ చనిపోయిన రెండునెలలకే ఆమెకు ముఖ్యమంత్రి పదవి మీద ఎందుకు ఆశ పుట్టింది? కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకిస్తూనే ఎంజీఆర్ పార్టీ పెట్టారు. మాది డీఎంకే వ్యతిరేక పార్టీ. మేం కూడా అదే బాటలో నడుస్తాం. ఎంజీఆర్ ను పార్టీ నుంచి తొలగించినప్పుడు మేం అంతా జైలుకువెళ్లాం. నేనుఇప్పటికి 49సార్లు జైలుకువెళ్లా. పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే. కేంద్రంతో సన్నిహితంగా ఉండటం తప్పేం కాదు. కేంద్రంతో క్లోజ్ గా ఉంటేనే రాష్ట్రానికి నిధులు అందుతాయని ఎంజీఆర్ అనే వారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లే చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ రాజీనామా చేసినప్పుడు తాను పక్కన లేనన్న మధుసూధనన్.. శశికళ కుటుంబ సభ్యులు పన్నీర్ చొక్కా పట్టుకొని తోసేశారని.. కొట్టేందుకు ప్రయత్నించారని.. అలాంటి వేళలోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారన్నారు. మరి.. ఈ విషయాన్నిఅప్పుడే ఎందుకుబయటకు చెప్పలేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. పార్టీ పరువు కాపాడేందుకే అప్పట్లో ఆ విషయాన్న చెప్పలేదని అన్న ఆయన.. ‘‘ఈ రోజు ముఖ్యమంత్రి చొక్కానే పట్టుకున్నారు. రేపొద్దున నన్నుకూడా అలానే పట్టుకోవచ్చు కదా. శశికళ కుటుంబం మొత్తం ఈ తరహా రాజకీయాల్నే చేస్తుంది. అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు అమ్మను చూడనివ్వలేదు. నన్నేమిటి.. గవర్నర్ ను కూడా చూడనివ్వలేదు. అమ్మ మృతి మీద విచారణ జరగాల్సిందే’’ అంటూ చిన్నమ్మ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమ్మ మరణం వెనుక పెద్ద రహస్యం దాగి ఉందని.. దాని మీద విచారణ జరపాలన్న ఆయన.. జరిగిందేమిటన్నది దేవుడికే తెలుసని వ్యాఖ్యానించటం గమనార్హం.