Begin typing your search above and press return to search.
రూప ఎఫెక్ట్...శశికళ కన్నీరు మున్నీరు!
By: Tupaki Desk | 29 July 2017 8:09 AM GMTజైలులో అన్నాడీఎంకె తాత్కాళిక ప్రధాన కార్యదర్శి శశికళకు వీవీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని జైళ్ల శాఖ డీఐజీ రూప ఆరోపణలు కలకం రేపిన సంగతి తెలిసిందే. రూప ఈ ఆరోపణలతో శశికళ తీవ్ర ఇరకాటంలో పడ్డారు. మీడియాకు ఈ విషయాన్ని లీక్ చేశారన్న ఆరోపణలతో రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు. లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణరావు..రూప తన వ్యాఖ్యలను 3 రోజుల్లోపు వెనక్కి తీసుకుని డిమాండ్ చేశారు. రూప క్షమాపణలు చెప్పకపోతే రూ.50కోట్ల పరువునష్టం దావా వేస్తానని నోటీసులు కూడా పంపించారు. దీంతో ఈ ముడుపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.
రూప పుణ్యమా అని తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ శశికళకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన అన్న భార్య, టీటీవి దినకరన్ కు అత్తగారైన సంతానలక్ష్మి ఈ నెల 26న మృతి చెందారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్ కోసం శశికళ దరఖాస్తు చేసుకోగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అధికారులు తిరస్కరించారు. దీంతో, శశికళను వదిన మరణం మరింత కలచివేసినట్లయింది. తన వదిన కడచూపుకు కూడా నోచుకోలేకపోయానన్న బాధతో శశికళ కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. జైల్లో శశికళతో పాటు ఉన్న ఆమె మరో బంధువు ఇళవరసి ఆమెను ఓదారుస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు రూప ఆరోపణల నేపథ్యంలో జైలు అధికారులు నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. బయటి నుంచి ఎలాంటి వస్తువులు శశికళకు అందకుండా జాగ్రత్తపడుతున్నారు. శివలింగానికి పూలు, పాలతో పూజ చేసే శశికళకు.. ప్రస్తుతం అవేవి అందించడం లేదు. దీంతో జైల్లోని నీళ్లతోనే జలాభిషేకం చేస్తూ దైవ ప్రార్థనలతో గడుపుతున్నారని సమాచారం.
డీజీపీ సత్యనారాయణ నోటీసులకు తాను బెదిరిపోనని రూప సవాల్ చేశారు. బెంగుళూరుకు చెందిన నటరాజశర్మ అనే న్యాయవాది ...రూపకు మద్దతుగా నిలిచాడు. ఈ ముడుపుల వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీని కోరాడు. రూ.2కోట్ల ముడుపుల వ్యవహారంలో ప్రమేయం ఉన్న దినకరన్ తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ప్రకాష్ అనే వ్యక్తిని కూడా విచారణ చేయాలని ఆయన కోరాడు. దినకరన్ స్నేహితుడు మల్లికార్జున్ కోరిక మేరకే ప్రకాష్ సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే జైల్లో సేకరించిన ఆధారాలను డీఐజీ రూప.. తన ఉన్నతాధికారుల కన్నా ముందు మీడియాకు ఎందుకు బహిర్గతం చేయాల్సి వచ్చిందని కూడా ప్రశ్నించిన ఆయన.. దీనిపై కూడా విచారణ జరిపించాలని కోరారు.