Begin typing your search above and press return to search.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతోనే AIADMK ప్రయాణం !

By:  Tupaki Desk   |   22 Nov 2020 12:50 PM GMT
2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతోనే AIADMK ప్రయాణం !
X
వచ్చే ఏడాది లో తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో అన్ని ప్రధాన పార్టీలు కూడా అధికారం కోసం ఇప్పటి నుండే పొత్తులపై ఒక క్లారిటీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం తమ పార్టీ అన్నాడీఎంకే బీజేపీ కూటమితో కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన ప్రభుత్వ కార్యక్రమంలో ఈ అధికారిక ప్రకటన వెల్లడైంది. ఎన్నికలకి మరో ఆరు నెలల సమయం మాత్రమే మిగిలివుంది.

అలాగే , ఎన్నికల పై సీఎం మాట్లాడుతూ 2021 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఎక్కువ సీట్లు గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల వెట్రివేల్l యాత్ర వివాదంతో అన్నాడీఎంకే, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ వైఖరిపై అన్నాడీఎంకేలో వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే బీజేపీ కూటమి నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపించాయి. అన్నాడీఎంకే తాజా ప్రకటనతో ఆ పుకార్లకు చెక్ పడింది. తమిళనాడులో రూ.63,378 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పన్నీరుసెల్వం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని పళనిస్వామి అన్నారు.