Begin typing your search above and press return to search.

కామెడీ పేరుతో ఎంత బ‌లుపు చూపిస్తున్నారో..

By:  Tupaki Desk   |   15 July 2017 4:22 AM GMT
కామెడీ పేరుతో ఎంత బ‌లుపు చూపిస్తున్నారో..
X
కామెడీ పేరుతో బ‌లుపు ప్ర‌ద‌ర్శించ‌టం కొంద‌రికి అల‌వాటే. విష‌యాన్ని సున్నితమైన వ్యంగ్యాన్ని మేళ‌వించ‌టం త‌ప్పేం కాదు. అయితే.. అందుకు భిన్నంగా పిచ్చి చేష్ట‌ల‌తో కించ‌ప‌ర్చ‌టం.. మ‌నోభావాలు దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించ‌టంతోనే అస‌లు స‌మ‌స్య‌. హాస్యం పేరుతో బ‌లుపును ప్ర‌ద‌ర్శించే ఒక కామెడీ గ్రూప్ పై పలువురు మండిప‌డుతున్నారు. కోట్లాది మంది అభిమానించే ప్ర‌ముఖుల్ని కించ‌ప‌రస్తూ.. చౌక‌బారుగా చిత్రీక‌రించ‌టం ఒక ఎత్తు అయితే.. ఇలాంటి వాటిని త‌ప్పు ప‌ట్టిన వారిపై బ‌లుపు ప్ర‌ద‌ర్శిస్తున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత‌కీ ఆ కామెడీ గ్రూప్ ఏది? దాని బ‌లుపు లెక్క చూస్తే..

సోష‌ల్ మీడియాలో ప్ర‌ముఖుల్ని త‌ర‌చూ చిన్న‌బుచ్చేలా చేయ‌టంలో ఏఐబీ అనే గ్రూప్ ఉంది. ఇంత‌కీ ఏఐబీ అనే దానికి వారు పెట్టుకున్న పేరులోనే.. వారి పైత్యం ఏ స్థాయిలో ఉందో అర్థ‌మ‌వుతుంది. ఇక‌.. ఈ గ్రూప్ పోస్ట్ చేసే పోస్టుల్ని చూస్తే.. స‌చిన్ టెండూల్క‌ర్ .. ల‌తా మంగేష్క‌ర్‌.. ఇలా ప్ర‌ముఖుల్ని అస‌హ్యంగా చిత్రీక‌రిస్తూ పోస్టులు పెడుతుంటారు.

తాజాగా వీరు ప్ర‌ధాని మోడీని కించ‌ప‌రిచేలా చేసిన పోస్టులు వివాదంగా మారాయి. రైల్వే స్టేష‌న్లో భుజానికి బ్యాగ్ ప‌ట్టుకొని వెయిట్ చేస్తున్న వ్య‌క్తిగా మోడీని చూపించ‌టం.. ఆ ప‌క్క‌నే మోడీని కించ‌ప‌రిచేలా మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను గుర్తించిన ఒక మ‌హిళ ముంబ‌యి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్ర‌ధాని గౌర‌వానికి.. మ‌ర్యాద‌కు భంగం వాటిల్లేలా వ్య‌వ‌హ‌రించిన స‌ద‌రు పోస్టుల‌పై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

ఇదిలా ఉంటే.. స‌ద‌రు గ్రూప్ కు చెందిన తన్మ‌య్ భ‌ట్ అనే ముఖ్య‌డు తాజాగా ఒక పోస్ట్ చేస్తూ.. త‌న‌కున్న పైత్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. మాకు ఇష్టం వ‌చ్చిన‌ట్లు పోస్ట్ చేస్తాం.. అవ‌స‌ర‌మైతే డిలీట్ చేస్తాం.. అవ‌స‌ర‌మైతే మ‌ళ్లీ పోస్ట్ చేస్తాం.. మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరని పేర్కొన్నారు. త‌న్మ‌య్ భ‌ట్ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు మండిప‌డుతున్నారు. చేసింది ఎద‌వ ప‌ని అయిన‌ప్ప‌టికీ దాన్ని అత‌గాడు స‌మ‌ర్థిస్తున్న తీరుపై మండి ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ గ్రూప్ పై ముంబ‌యి పోలీసులు కేసు క‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది.