Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రం రెడీ

By:  Tupaki Desk   |   22 Nov 2018 4:36 PM GMT
కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రం రెడీ
X
తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పార్టీల కార్యకర్తలు - నాయకులు తమ నియోజవర్గాలలో తమదైన శైలిలో ప్రచారం మొదలుపెట్టారు. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు సాధ్యం కాని హమీలను తమ మేనీఫెస్టోలో పెట్టి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ వాగ్దానాలన్నీ కూడా ఎన్నికలలో గద్దె ఎక్కేవరకే - తర్వాత అవన్నీ కూడా సముద్రంలో అలలగా కలిసిపోతాయి. గత ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీ గెలిస్తే ఓ దళితుడిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. అయితే అధికారం కైవసం చేసుకున్నాక ఆ పార్టీ మాటలు - చేతలు కూడా మారిపోయాయి. ఇలా ప్రతిసారి ఎన్నికలలో రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ పేరుతో వాగ్దానాలు చేయడం - ఆ తర్వాత ఆ వాగ్దానాలు మరుగునపడిపోవడం పరిపాటే . అయితే ఇప్పుడు తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆడాళ్లు మీకు జోహారు అంటూ కొత్త ప్రతపాదనను తీసుకువచ్చింది. తెలంగాణలో మహాకూటమిని కనుక గెలిపిస్తే ఒక మహిళను ముఖ్యమంత్రిగా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో తెలంగాణలోని మహిళ ఓట్లను కొల్లగొట్టడానికి దీన్నో బ్రహ్మాస్త్రంగా ఆ పార్టీ భావిస్తోంది.

అఖిల భారత కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుస్మితా దేవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి గత నాలుగేళ్లుగా మహిళల పురోగతికి చేసింది ఏమి లేదని - కల్వకుంట్ల వారి పాలనతో మహిళలు చాల అన్యాయానికి గురైయ్యారని అన్నారు. రాబోయే ఎన్నికలలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత తెలంగాణకు మొదట ఒక మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర తిరగరాస్తుందని ఆవిడ అన్నారు. ఈ విషయమై రాహుల్ గాంథీకి త్వరలోనే వినతి పత్రం అందజేస్తామని అన్నారు. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మహిళల అభ్యుదయానికి పాటు పడిన పార్టీగా చరిత్రకెక్కిందని ఆవిడ అన్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వలేదు. మహాకూటమి మాత్రం వీలైనన్నీ ఎక్కువ స్దానాలలో మహిళ్లకు టికెట్లు ఇచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలన్నింటికంటే ఎక్కువ శాతంలో మహిళలకు టికెట్లిచ్చింది