Begin typing your search above and press return to search.
రజినీకాంత్ తో పొత్తుకు సిద్ధం..క్లారిటీ ఇచ్చిన ఇచ్చిన పన్నీర్ సెల్వం
By: Tupaki Desk | 4 Dec 2020 2:30 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం పై గురువారం కీలక ప్రకటన చేశారు. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్టు తలైవా ప్రకటించారు. పూర్తి వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని ట్విట్టర్ వేదికగా ఆయన స్పష్టం చేశారు. దీనిపై అన్నాడీఎంకేకు చెందిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం స్పందించారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి రావాలన్న సూపర్‌స్టార్ రజినీకాంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో రజిని పార్టీతో పొత్తు గురించి గురువారం స్పందించారు.
రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చని అన్నారు. అవకాశం ఉంటే రజినీ పార్టీతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రజనీకాంత్ పార్టీతో అన్నాడీఎంకే పార్టీకి ఎలాంటి నష్టమూ లేదని ఆయన స్పష్టం చేశారు.ఇక , రజినీ రాజకీయ ప్రవేశంపై డీఎంకే కూడా స్పందించింది. ఆయన పార్టీ వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని, తమ ఓటు బ్యాంకుకు వచ్చే నష్టం ఏమీలేదని డీఎంకే సీనియర్ నేత ఏ రాజా తెలిపారు.
అసలు రజినీ పార్టీ పెడతారా లేదా అనే సందేహంలో అభిమానులు ఉన్న తరుణంలో డిసెంబర్ 31న పార్టీపై ప్రకటన చేస్తానని, జనవరిలో పార్టీ లాంచింగ్ కార్యక్రమం ఉంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో రజినీ అభిమానులు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇక వచ్చే ఏడాది మొదట్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయం వేడెక్కింది.