Begin typing your search above and press return to search.

వీణావాణిలను మనోళ్లు ఎవరూ వేరు చేయలేరట

By:  Tupaki Desk   |   9 Jun 2016 7:37 AM GMT
వీణావాణిలను మనోళ్లు ఎవరూ వేరు చేయలేరట
X
ఒకటి కాదు రెండు కాదు గడిచిన 13 ఏళ్లుగా తలలు అంటుకొని పుట్టిన అవిభక్త కవలలు వీణ..వాణిల నరకయాతన కొత్త మలుపు తిప్పింది. వీరిని విడదీసే విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు డాక్టర్లు తమ వల్ల కాదని తేల్చేశారు. అవిభక్త కవలలుగా పుట్టిన వారిని విడదీసేందుకు గతంలో జరిగిన ప్రయత్నాలకు భిన్నంగా ఈసారి.. ఖర్చు విషయంలో వెనక్కి తగ్గకుండా వారిని వేరే చేయాలన్న తలంపుతో తెలంగాణ సర్కారు ముందుకొచ్చింది.

వారి కేసును ఎయిమ్స్ డాక్టర్లకు అప్పజెప్పింది. వీరిద్దరిని క్షుణ్ణంగా పరీక్షించిన వైద్యులు.. వీణ వాణిలను వేరు చేయటం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. వారిని విడదీయం అసాధ్యంగా తేల్చేసిన వారు.. వారిని విడదీసే ప్రయత్నం చేస్తే ప్రాణహాని ఉందని.. ఒకవేళ విడదీసే కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయినా.. వారు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొంటారని వారు చెబుతున్నారు. దీంతో.. వీరిద్దరిని వేరు చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇక.. విదేశాల్లో వీరిద్దరిని విడదీసే కార్యక్రమానికి సంబంధించిన వాకబు చేపట్టాలి. మనోళ్లు ఎవరూ వీరిని విడదీయలేమని తేల్చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.