Begin typing your search above and press return to search.

ఏలూరు వింత వ్యాధి కి కారణం అదే .. తేల్చేసిన ఎయిమ్స్ నిపుణులు

By:  Tupaki Desk   |   16 Dec 2020 12:51 PM GMT
ఏలూరు వింత వ్యాధి కి కారణం అదే .. తేల్చేసిన ఎయిమ్స్ నిపుణులు
X
అంతుచిక్కని అనారోగ్యం.. ఏలూరు ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే వందల మంది బాధితులు ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే వారిలో కొద్దిమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే , తాజాగా ఈ వింత వ్యాధికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. దీనికి సంంధించిన రిపోర్టులను ఎయిమ్స్, ఇతర సంస్థలు ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. పురుగుల మందుల అవశేషాలే ఏలూరు వ్యాధికి కారణమని స్పష్టం చేశాయి. అయితే, అవి మనుషుల శరీరంలోకి ఎలా చేరాయనేదానిపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు.

దీనిపై ఢిల్లీ ఎయిమ్స్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలను పరిశీలించాలని, అవసరం అయితే, ప్రతి జిల్లాలోనూ ల్యాబ్ ‌లు ఏర్పాటు చేయాలన్నారు. దాని ఫలితాల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకి తెలిపారు. ఏలూరు లాంటి ఘటనలు మరోచోట జరగకూడదన్నారు. మరోవైపు ఆర్బీకేల ద్వారా సేంద్రీయ ఎరువులతో వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం వైస్ జగన్ సూచించారు.