Begin typing your search above and press return to search.

'టీకా' తీసుకున్న ఏ ఒక్కరూ చనిపోలేదు : ఎయిమ్స్‌ కీలక నివేదిక !

By:  Tupaki Desk   |   4 Jun 2021 10:30 AM GMT
టీకా తీసుకున్న ఏ ఒక్కరూ చనిపోలేదు : ఎయిమ్స్‌ కీలక నివేదిక !
X
కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకొచ్చిన వ్యాక్సిన్లు మంచి ఫలితాన్ని ఇస్తున్నట్టు ఆలిండియా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నవారు కరోనా వైరస్‌ బారినపడినా ఎవరూ మరణించలేదని నివేదిక ఇచ్చింది. ఈ మేరకు తాము చేసిన అధ్యయన నివేదికను శుక్రవారం ఎయిమ్స్‌ విడుదల చేసింది. మొత్తం 63 మందిని ఢిల్లీలో పరీక్షించగా వారు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. ఈ సందర్భంగా సర్వే వివరాలను వెల్లడించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా సోకిన 63 మందిపై ఢిల్లీలో అధ్యయనం చేశారు.

ఏప్రిల్‌- మే నెలలో ఈ అధ్యయనం జరిగింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వైరస్‌ సోకిన వారిని శాంపిళ్లను జీనోమిక్‌ సీక్వెన్స్‌ సంస్థ అధ్యయనం చేసింది. ఇందులో వ్యాక్సిన్‌ వేసుకున్న వారెవరూ కూడా కరోనాతో మరణించలేదని సర్వేలో తేలింది. వ్యాక్సిన్‌ సోకిన తర్వాత కరోనా సోకితే దానిని బ్రేక్‌ త్రూ ఇన్‌ ఫెక్షన్ గా పిలుస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో లోడ్‌ అధికంగా ఉందని గుర్తించింది. అయితే దానివల్ల ఎలాంటి ప్రమాదం, ప్రాణసంకటం ఏమీ జరగలదేని అధ్యయనంలో ఎయిమ్స్‌ కనుగొంది. మొత్తం 63 బ్రేక్‌ త్రూ ఇన్‌ ఫెక్షన్స్ పరిశీలించారు. వీరిలో 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక డోసు వేసుకున్నారు. 53 మంది కోవాగ్జిన్‌, 10 మంది కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. వీరంతా 5 నుంచి ఏడు రోజుల వరకు అధిక జ్వరంతో బాధపడ్డారు. వారి వయసు 21 నుంచి 92 ఏళ్ల వయసు ఉంటుంది.ఎవరికీ దీర్ఘకాలిక వ్యాధులు లేవు.పది మందిలో పూర్తిస్థాయి ఇమ్యునోగ్లోబిన్‌ జీ యాంటీబాడీలు ఉన్నాయి. ఆరుగురిలో కరోనా సోకకముందే యాంటీబాడీలు వృద్ధి చెందాయి.నలుగురికి ఇన్ఫెక్షన్ తర్వాత యాంటి బాడీలు వృద్ధి చెందాయి.