Begin typing your search above and press return to search.
లేడీ ఎంపీల SEATని అసభ్యంగా తాకిన ప్రధాని తండ్రి !
By: Tupaki Desk | 17 Nov 2021 11:30 PM GMTబ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ తమను అసభ్యంగా తాకారని, అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందినక ఎంపీ సహా ఇద్దరు మహిళలు ఆరోపణలు చేశారు. 2003లో టోరీ పార్టీ సదస్సు వద్ద స్టాన్లీ జాన్సన్ తన వెనుకవైపు గట్టిగా కొట్టి, ఓ రామ్సీ, నీ సీటు లవ్ లీ గా ఉంది అని వ్యాఖ్యానించారని, కరోలిన్ నోక్స్ తాజాగా స్కై న్యూస్ తో చెప్పారు. కరోలిన్ నోక్స్ 2010 నుంచి రామ్సీ, సౌతాంప్టన్ ఎంపీగా ఉన్నారు.
ఆమె ఆరోపించిన సంఘటన జరిగినట్లు చెప్తున్న 2003 కన్జర్వేటివ్ పార్టీ సదస్సు సమయంలో ఆమె పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.
ఇక, 2019 కన్జర్వేటివ్ సదస్సులో స్టాన్లీ జాన్సన్ తన శరీరాన్ని అసభ్యంగా తడిమారని, న్యూ స్టేట్స్‌మన్ మేగజీన్ పొలిటికల్ కరెస్పాండెంట్ ఏల్బీ రియా ఆరోపించారు. కరోలిన్ నోక్స్ గురించి తనకు గుర్తులేదని స్టాన్లీ జాన్సన్ స్కై న్యూస్ తో వెల్లడించారు.
కరోలిన్ నోక్స్ గురించి నాకు గుర్తులేదు. కానీ.. ఇదిగో. నో రిప్లై , హే హో.. గుడ్ లక్ అండ్ థాంక్స్ అని చెప్పాడు. ఈ వ్యాఖ్యల అనంతరం.. రియా ట్వీట్ చేశారు. స్టాన్లీ జాన్సన్ 2019లో పార్టీ సదస్సులో నన్ను కూడా అసభ్యంగా తాకారు అని అందులో ఆరోపించారు.
మేమెవరమూ సహించరాని దాని గురించి, అసలు ప్రధానమంత్రి తండ్రి పనుల గురించి.. కరోలిన్ నోక్స్ గొంతెత్తినందుకు చాలా కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు. కరోలిన్ నోక్స్ హోం వ్యవహారాల మంత్రిగా, కార్మిక, పెన్షన్ల శాఖ మంత్రిగా, కేబినెట్ ఆఫీస్ మంత్రిగా పనిచేశారు. యూరోపియన్ పార్లమెంటు మాజీ సభ్యుడైన స్టాన్లీ జాన్సన్ ఎన్నడూ ఎంపీగా ఎన్నికవలేదు.
ఇక ఇదిలా ఉంటే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ , ఈ ఏడాది మే లో మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఫియాన్సీ క్యారీ సైమండ్స్‌ను ఆయన పెళ్లాడారు. బోరిస్ జాన్సన్ వయస్సు 56 సంవత్సరాలు. ఇదివరకే ఆయనకు రెండుసార్లు వివాహమైంది.
న్యాయవాది మెరినా వీలర్‌ను ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. నలుగురు సంతానం. 2018 సెప్టెంబర్‌లో బోరిస్ జాన్సన్, వీలర్ విడిపోయారు. ఆ తరువాత 2019లో జాన్సన్.. క్యారీ సైమండ్స్‌తో సహజీవనం ఆరంభించారు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. బ్రిటన్‌లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీలో సైమండ్స్ క్రియాశీలకంగా పనిచేస్తోన్నారు.