Begin typing your search above and press return to search.
భైంసాలో విజయదుందుబి మోగించిన ఎంఐఎం !
By: Tupaki Desk | 25 Jan 2020 10:30 AM GMTతెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని జోరు చూపించిన టీఆర్ ఎస్ నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో మాత్రం తన జోరుని చూపించ లేకపోయింది. తెలంగాణ లో ప్రభంజనం సృష్టిస్తున్న టీఆర్ ఎస్ పార్టీ భైంసాలోని ఒక్క వార్డులో కూడా బోణీ కొట్టలేకపోయింది. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీ లో మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 గెలుపొందగా, బీజేపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు రెండు వార్డులను సొంతం చేసుకున్నారు.
చివరి వరకు బీజేపీ, ఎంఐఎం పార్టీలు రెండూ హోరాహోరీగా తలబడ్డాయి. బీజేపీ పార్టీనే వస్తుందని అందరూ అనుకున్న కూడా రివర్స్ గా ఎంఐఎం పార్టీ గెలిచి కమలానికి షాక్ ఇచ్చింది. అక్కడ అధికార టీఆర్ ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కనీసం పోటీలో కూడా లేకుండా పోయాయి. ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణల తో వార్తల్లో నిలిచిన భైంసాలో పుర పోరు ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. సుమారు 1000 మందితో పోలీసులు బందోబస్తు మరింత పటిష్టం చేశారు. పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ర్యాపిడ్‌యాక్షన్ ఫోర్స్, ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్, కర్ఫ్యూ ఎత్తివేసినా పట్టణం పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.