Begin typing your search above and press return to search.
ముస్లిం మహిళలకు ఇది తీపికబురే
By: Tupaki Desk | 12 April 2017 5:40 AM GMTముస్లిం సంప్రదాయంలోని వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ విషయంలో తీపి కబురు వినిపించింది. ఏడాదిన్నర కాలంలోనే ట్రిపుల్ తలాక్ కు స్వస్తి పలుకుతామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లాబోర్డు ఉపాధ్యక్షుడు సయీద్ సాదిక్ ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని ఉద్ఘాటించారు. ఈ విధానం విషయంలో తాము సమీక్షించుకొని, అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతనే తగు ఈ మేరకు ముందుడుగు వేసినట్లు తెలిపారు.
కాగా, కేంద్రం సైతం మహిళలకు అనుకూలమైన వాదన వినిపించడం ఆసక్తికరం. ట్రిపుల్ తలాక్ - నిఖా హలాలా - బహుభార్యాత్వంలాంటి ఆచారాలు ముస్లిం మహిళల సామాజిక హోదా - వారి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నాయని, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను వారికి దక్కకుండా చేస్తున్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ ఆచారాలు ముస్లింలలో మహిళలను పురుషులతో సమానం కాకుండాను, అలాగే మిగతా మతాల్లోని మహిళలకన్నా కూడా తక్కువ వారిగాను చేస్తున్నాయన్న తన వాదనను కేంద్రం సుప్రీంకోర్టుకు తాజాగా సమర్పించిన లిఖితపూర్వక అఫిడవిట్ లో పునరుద్ఘాటించింది. ఇలాంటి ఆచారాల కారణంగా రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ముస్లిం మహిళలు పూర్తిగా అనుభవించలేకపోతున్నారని కూడా కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.
ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాఖ్ - నిఖా హలాలా - బహుభార్యాత్వం లాంటి ఆచారాలు చాలా ముఖ్యమైన అంశాలని సుప్రీంకోర్టు గత మార్చి 30న వ్యాఖ్యానిస్తూ, వీటిని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం మే 11నుంచి విచారిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఆచారాలన్నీ పితృస్వామ్య వ్యవస్థనుంచి పుట్టినవని, సమాజంలో మహిళల పాత్రపై అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న భావనలని కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది. అంతేకాదు, ఒక మహిళ మానవ గౌరవం-సామాజిక గౌరవం-ఆత్మగౌరవంతో జీవించడమనేవి రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద ఆమెకు లభించిన జీవించే హక్కుకు చెందిన ముఖ్యమైన కోణాలని కూడా కేంద్రం తన లిఖితపూర్వక అఫిడవిట్‌లో పేర్కొంది. అందువల్ల ఈ ఆచారాలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరుతూ, ఆరు దశబ్దాలకు పైగా ముస్లిం వివాహ చట్టంలో ఎలాంటి సంస్కరణలు జరగలేదని, నోటి మాటతో విడాకుల భయం కారణంగా దేశ జనాభాలో 8 శాతం ఉన్న ముస్లిం మహిళలు అభద్రతా భావానికి గురవుతున్నారని కూడా కేంద్రం ఆ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఇలా ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ముస్లింల వ్యక్తిగత విభాగం సానుకూల నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/