Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ పై ఎయిమ్స్ వైద్యుడి సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   19 Dec 2021 4:59 AM GMT
ఒమిక్రాన్ పై ఎయిమ్స్ వైద్యుడి సంచలన కామెంట్స్
X
దక్షిణాఫ్రికాలో పుట్టి... ప్రపంచ దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీని బారిన ఉండేందుకు ఆయా దేశాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే దీనిపట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంపై దిల్లీ ఎయిమ్స్ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. డెల్టా కంటే అతివేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ తో ఎలాంటి ముప్పు ఉంటుందో ఆయన వివరించారు

జెట్ స్పీడ్ తో వ్యాప్తి చెందగలిగే గుణాలు కలిగి ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ పునీత్ మిశ్రా తెలిపారు. ఒమిక్రాన్ అతి వేగంగా మాత్రమే వ్యాప్తి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే డెల్టా కంటే ప్రమాదకరం కాదని అభిప్రాయపడ్డారు. దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేశారు.

డెల్టా వేరియంట్ కారణంగా సెకండ్ వేవ్ వచ్చిందని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన డెల్టా వేరియంట్... వివిధ దేశాల్లో ఎంతో మందిని పొట్టనబెట్టుకుందని అన్నారు. అయితే ఒమిక్రాన్ కు అంత తీవ్రత లేదని స్పష్టం చేశారు. ఈ వేరియంట్ కేసులు పెరిగినా కూడా మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని అన్నారు. సెకండ్ వేవ్ మాదిరిగా మరణాలు సంభవించవని ఆయన స్పష్టం చేశారు.

సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేరియంట్ కేసులు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఈ వేరియంట్ తో ప్రాణాలు కోల్పోయారని సమాచారం. రెండు డోసుల టీకా వేసుకుంటే ఈ వేరియంట్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.