Begin typing your search above and press return to search.
భారత్ లో ఎక్కువైపోతోన్న ఆ సమస్య.. అగ్రస్థానంలో యూపీ!
By: Tupaki Desk | 4 March 2020 3:30 AM GMTప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. ఈ సమస్య చైనా లో పుట్టినా , ఆ తరువాత ప్రపంచంలోని ఒక్కో దేశానికీ విస్తరించుతూ మొత్తం ప్రపంచంలోని దేశాలంన్నింటిని భయంతో వణికిస్తోంది. అయితే, కొంచెం కష్టపడితే , ఈ సమస్యని అధిగమించడం కష్టం కాకపోవచ్చు. కానీ , కరోనా కంటే భారత్ ని భయపెడుతున్న మరో ప్రధాన సమస్య వాయుకాలుష్య సమస్య. వాయుకాలుష్యం అనేది ఒక్క భారత్ కి మాత్రమే ప్రధాన సమస్య కాదు ...ప్రపంచ దేశాలకి వాలుకాలుష్య సమస్య ఉంది.
కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా ఆ చర్యల వల్ల, అంతగా ఫలితం ఉండటంలేదు. దీంతో కాలుష్య కోరల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య, అలాగే ఆయు ప్రమాణం తగ్గిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ వాయుకాలుష్యం వల్ల మనిషి సగటున ..తన జీవిత కాలం నుండి మూడేళ్ళని కోల్పోతున్నట్టు ఒక సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా మనుషుల్లో సగటున మూడేళ్ల ఆయు ప్రమాణం తగ్గిపోగా .. ఆసియాలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
చైనాలో అది 4.1 సంవత్సరాలు, ఇండియాలో 3.9,పాకిస్తాన్ లో 3.8గా ఉంది. భారత్ లో మిగతా రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ లో కాలుష్యం పతాక స్థాయిలో ఉంది. దాదాపు 20కోట్లు మంది నివసించే యూపీలో వాయు కాలుష్యం కారణంగా సగటున 8.9 సంవత్సరాల ఆయు ప్రమాణం పడిపోయినట్టుగా చికాగోకి చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ లో వెల్లడైంది. ఇక 7.4 కోట్ల జనాభా కలిగిన చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌లో ఆయు ప్రమాణం ఆరేళ్లుగా పడిపోయినట్టుగా తెలిపింది. ఏటా దాదాపు 80లక్షల పైచిలుకు మరణాలు వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని.. ప్రతీ ఏటా ఇది రెట్టింపు అవుతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) తెలిపింది.
వాయు కాలుష్యం ద్వారా అధిక ఆక్సీకరణ ఒత్తిడి రక్త నాళాలకు నష్టం కలిగిస్తుంది. ఇది రక్తపోటు, డయాబెటిస్, స్ట్రోక్, గుండెపోటు వంటి వాటికి దారితీస్తుంది. చైనాలో దాదాపు 20.8మిలియన్ల మంది ఏటా వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. సాధారణంగా హెచ్ ఐ వీ/ఎయిడ్స్,మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులతో పోలిస్తే వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాలు 19 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు జర్నల్ తెలిపింది. గడిచిన కొన్నేళ్లుగా ఈ సమస్య మొదలైనప్పటికీ ..దీని పై ఎవరూ పెద్దగా శ్రద్ద చూసి , నివారించడానికి ప్రణాళికలు రచించకపోవడం తో రోజురోజుకి పెరిగి ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటినుండైనా దీనిపై ఒక అవగాహనకి వచ్చి, నియంత్రించే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో వాయు కాలుష్యం అన్నింటికంటే పెద్ద సమస్య అవుతుంది అని నిపుణులు చెప్తున్నారు.