Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : భారీగా తగ్గిన విమాన చార్జీలు !

By:  Tupaki Desk   |   20 July 2020 11:30 PM GMT
కరోనా ఎఫెక్ట్ : భారీగా తగ్గిన విమాన చార్జీలు !
X
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. కరోనా అమెరికా లో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో విమానాల్ని ఆపేసారు. ఆ తరువాత దేశీయ విమానాలు ప్రారంభించినా కూడా విదేశీ విమానాలు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో వందే భారత్ మిషన్‌ కింద అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

జులై 22 నుంచి ఆగస్ట్‌ 31 వరకూ అమెరికాకు 180 ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఆరు నగరాల నుంచి విమాన సర్వీసులు న్యూయార్క్‌, చికాగో, నెవార్క్‌, శాన్ ‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్‌ డీసీలకు ప్రయాణీకులు ఈ విమానాల ద్వారా రాకపోకలు సాగించబోతున్నాయి. భారత్‌ నుంచి అమెరికా వెళ్లే ప్రయాణీకులు స్టార్‌ అలయన్స్‌ భాగస్వాముల ద్వారా అక్కడ తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చని ఎయిర్‌ ఇండియా వెల్లడించింది. కాగా వందే భారత్‌ మిషన్‌ లో తొలి రెండు దశల్లో విమాన ఛార్జీలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో మూడవ దశలో ఎయిర్‌ ఇండియా విమాన చార్జీలను గణనీయంగా తగ్గించింది.

ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా యునై టెడ్‌ ఎయిర్ ‌లైన్స్‌ విమానాలు సోమవారం నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించేందుకు అనుమతించారు. ఇక ఫ్రాన్స్‌, జర్మనీల తో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఎయిర్‌ ఫ్రాన్స్‌ ఈనెల 18 నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూర్‌, పారిస్‌ ల మధ్య జులై 18 నుంచి ఆగస్ట్‌ 1 వరకూ 28 విమానాలను నడపనుంది. కాగా జులై 16 వరకూ వందే భారత్‌ మిషన్‌ కింద 2362 విమానాలు నడిచాయని, 3,16,000 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.