Begin typing your search above and press return to search.
పాక్ మెడలు వంచిన ఇండియా... అభినందన్ విడుదలకు ఓకే
By: Tupaki Desk | 28 Feb 2019 12:18 PM GMTపాక్ యుద్ద విమానాలను తిప్పి కొట్టే క్రమంలో పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన ఇండియన్ పైలెట్ విక్రమ్ అభినందన్ ను విడిచి పెట్టాల్సిందే అంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇండియన్ పైలెట్ ను విడుదల చేసేందుకు పాకిస్థాన్ ఒప్పుకుంది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. రేపు పాకిస్థాన్ నుండి ఇండియాకు అభినందన్ ను పంపిస్తామని ప్రకటించాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తామేదో భయపడి అభినందన్ ను విడిచి పెడుతున్నట్లుగా భావించవద్దని, ఇండియా పాకిస్థాన్ మద్య పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే విడిచి పెడుతున్నామని ప్రకటించాడు. అయితే అంతర్జాతీయంగా పాకిస్థాన్ పై ఒత్తిడి తీవ్రంగా రావడం వల్లే విడుదల చేస్తున్నారంటూ ప్రపంచ మీడియా మొత్తం కోడై కూస్తోంది.
పైలెట్ అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన వెంటనే ఇండియా స్పందించింది. జెనీవా ఒప్పందం ప్రకారం గాయాలతో దొరికిన జవాన్ లకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, అలా హాని తలపెడితే మాత్రం జెనీవా ఒప్పందంను ఉల్లంఘించినట్లే అంటూ బలంగా వాదన వినిపించింది. భారత ప్రభుత్వం పలు ప్రపంచ దేశాల అధినేతలతో మాట్లాడి ఇండియాకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసి సఫలం అయ్యింది. మొదట అభినందన్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన పాకిస్థాన్ ఆర్మీ ఎప్పుడైతే ఇండియా జెనీవా ఒప్పందం గురించి తీసుకు వచ్చిందో అప్పుడే వెంటనే అభినందన్ కు మర్యాద ఇవ్వడం ప్రారంభించింది.
మొదట అభినందన్ కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కు కట్టి అతడిని ఇబ్బంది పెట్టిన వీడియో బయటకు వచ్చిన విషయం తెల్సిందే. అభినందన్ కోసం ఇండియా అంతర్జాతీయ సమాజంతో ఎప్పుడైతే చర్చలు మొదలు పెట్టిందో వెంటనే మరో వీడియోను విడుదల చేసి అభినందన్ తో మాట్లాడించడం జరిగింది. రెండవ వీడియోలో అభినందన్ కు అక్కడ ఆర్మీ వారు మర్యాదలు చేస్తున్నట్లుగా, అతడు పాక్ ఆర్మీ పట్ల సంతృప్తి కరంగా ఉన్నట్లుగా చెప్పించారు. అప్పుడే పాకిస్థాన్ అభినందన్ ను ఖచ్చితంగా విడుదల చేస్తుంది, అది ఎప్పుడు అనేది తెలియాల్సి ఉందని అంతా భావించారు.
ఇండియా అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను దోషిగా బలంగా చూపించడంతో పాటు ఉగ్రదేశంగా, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశంగా చూపించే ప్రయత్నం చేయడంతో పాకిస్థాన్ 24 గంటల్లోనే అభినందన్ ను విడిచి పెట్టేందుకు ఓకే చెప్పింది. పాకిస్థాన్ ఎలాంటి కండీషన్స్ లేకుండా అభినందన్ ను విడిచి పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఇండియా మాత్రం పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అణచి వేయాలని డిమాండ్ చేస్తుంది. జైషే మహ్మద్ ను ఉగ్రవాదిగా గుర్తించి ఆయన్ను అరెస్ట్ చేయాలని, పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలన్ని కూడా నాశనం చేయాలని అమెరికా మరియు చైనా వంటి దేశాలతో చెప్పిస్తుంది. ఇప్పటికే అమెరికా మరియు చైనాలు పాకిస్థాన్‌కు ఉగ్రవాదంను అరికట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
మొత్తానికి అభినందన్ విడుదల అనేది పాకిస్థాన్ పై ఇండియా పై చేయి సాధించినట్లే అంటూ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. పైలెట్ విక్రమ్ అభినందన్ కు ఘన స్వాగతం పలికేందుకు యావత్త్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రేపు ఏ టైంకు అభినందన్ ఇండియాకు వచ్చేది పాకిస్థాన్ అధికారికంగా తెలియజేయలేదు. ఇక అభినందన్ విడుదల విషయంపై ఇండియన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.