Begin typing your search above and press return to search.
ఎంపీలకు కేంద్రం షాక్ - ఎయిర్ఇండియా ఫ్రీ టికెట్స్ బంద్ !
By: Tupaki Desk | 30 Oct 2021 10:30 AM GMTతీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ బిడ్డింగ్ లో దక్కించుకున్న తర్వాత.. కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా సంస్థకు అప్పగించేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ఈ కసరత్తులో భాగంగా అన్ని బకాయిలను ముందుగానే క్లియర్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.
అందరూ ఎయిర్ ఇండియా విమాన టికెట్లను డబ్బు చెల్లించి కొనాలని కూడా స్పష్టం చేసింది. పార్లమెంట్ సభ్యులకు (ఎంపీ) ఇప్పటికే ఉచిత ఎయిర్ ఇండియా విమాన టికెట్లు నిలిచిపోయాయి. ప్రభుత్వ సంస్థగా ఎయిర్ఇండియా ఉన్నన్నాళ్లు ఎంపీలకు ఉచితంగా టికెట్ ప్రొటోకాల్ అమలయ్యేది. ఇప్పుడు ప్రైవేటు సంస్థగా ఎయిర్ ఇండియా సేవలందించనున్న నేపథ్యంలో ఎంపీలు విమాన టికెట్లను ఉచితంగా పొందలేరని, డబ్బులు పెట్టి కొనాలని రాజ్యసభ సచివాలయం శుక్రవారం వెల్లడించింది. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఉచిత టికెట్ సదుపాయం కూడా రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
జా నిర్ణయం ప్రకారం ఎంపీలు తమ డబ్బులతో టికెట్లు కొనుగోలు చేసి తర్వాత పార్లమెంటు సచివాలయానికి రీఎంబర్స్ మెంటుకు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే కేంద్రియ విద్యాలయాల్లో ఎంపీలకు 10 శాతం రిజర్వేన్ ఉండేది. ఇది సరిపోకపోతే కేంద్రమంత్రి విచక్షణతో ఎంపీలు మరిన్ని సీట్లను తీసుకునేవారు. ఇపుడు ఆ రిజర్వేషన్ ప్రక్రియను కూడా కేంద్రం రద్దుచేసేసింది. ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ ఫండ్లను కూడా నిలిపేసింది. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఏటా ప్రతి ఎంపీకి కేంద్రం రు. 5 కోట్లను మంజూరు చేస్తోంది. అయితే కొన్ని చోట్ల ఈ ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వినబడుతున్నాయి. దాంతో హోలు మొత్తంగా ఫండ్స్ రిలీజ్ ను కేంద్రం ఫ్రీజ్ చేసేసింది. ఇప్పటికే పార్లమెంటు క్యాంటిన్ లో దొరికే ఆహారం ధరలు బాగా పెంచేసిన విషయం తెలిసిందే.