Begin typing your search above and press return to search.

48 మంది పైలట్ల పై వేటేసిన ఎయిరిండియా !

By:  Tupaki Desk   |   15 Aug 2020 1:30 PM GMT
48 మంది పైలట్ల పై వేటేసిన ఎయిరిండియా !
X
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 48 మంది పైలట్లను తొలగిస్తూ రాత్రి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ సంస్థ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా వైరస్ ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా పైలట్లను తొలగించాల్సి వచ్చిందని వారికి రాసిన లేఖలో తెలిపింది. సకాలంలో జీతాలు చెల్లించలేదంటూ జూలై , 2019 న ఈ 48 మంది పైలట్లు రాజీనామా చేశారు. అయితే 6 నెలల నోటీసు పీరియడ్ లో ఈ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. దీనికి అధికారిక ఆమోదం తరువాత ప్రస్తుతం వీరంతా ఎయిర్ బస్ విధుల్లో ఉన్నారు. అయితే గత రాత్రి హఠాత్తుగా తొలగింపు ఆదేశాలివ్వడం ఆందోళన రేపింది. ఇది తెలియని కొంతమంది పెలట్లు ప్రస్తుతం విధుల్లో ఉండటం గమనార్హం.

కరోనా కారణంగా ప్రస్తుతం కార్యకలాపాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భారీ నష్టాల్లో ఉన్నాం.. ఆర్థిక సామర్థ్యం లేదంటూ ఎయిరిండియా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. పైలట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలనంటూ ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరికి, ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ కు ఒక లేఖ రాసింది. కాగా, తొలగింపునకు గురైన పైలట్లలో కొందరు ప్రస్తుతం విధుల్లో ఉండడం గమనార్హం. అలాగే తొలగింపునకు గురైన వారు ఎయిర్ ‌బస్ 320 పైలట్లుగా ఉన్నారు.