Begin typing your search above and press return to search.

ఆడోళ్లతో ఎయిరిండియా చేసిన సాహనం

By:  Tupaki Desk   |   8 March 2016 10:15 AM IST
ఆడోళ్లతో ఎయిరిండియా చేసిన సాహనం
X
నిజమే.. ఎయిరిండియా భారీ సాహసాన్నే చేసింది. అవకాశం ఇవ్వాలే కానీ మహిళలు.. మగాళ్లకు ఏమాత్రం తీసి పోరన్న విషయాన్ని మాటలతో కాదు.. చేతలతో చేసి చూపించటమే కాదు.. ఒక ప్రపంచ రికార్డును సృష్టించింది. నిజానికి ఎయిరిండియాకు వచ్చిన ఈ ఐడియాను అందరూ అభినందించాల్సిందే. ఇంతకీ ఎయిరిండియా చేసిన సాహసం ఏమిటంటారా?

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మొత్తం మహిళా సిబ్బందితో కూడిన విమానాన్ని.. సుదూర తీరానికి నడిపి రికార్డు సృష్టించింది. పైలెట్.. కోపైలెట్ మొదలుకొని ఎయిర్ హోస్టెస్ వరకూ అందరూ మహిళా సిబ్బంది ఉండటం.. అది కూడా 17 గంటల పాటు సాగే జర్నీ కావటం.. ఈ సమయంలో 14,500 కిలోమీటర్లు విమానాన్ని నడపటం ఈ రికార్డు ప్రత్యేకత.

న్యూఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి మొత్తం మహిళా సిబ్బందితో విమానాన్ని నడిపి రికార్డు సృష్టించారు. పూర్తిగా మహిళా స్టాఫ్ తో ఒక విమానాన్ని నడపటం ఇప్పటివరకూ ప్రపంచంలో మరే దేశం చేయలేదని.. ఇదే తొలిసారని.. ఆ ఘనత సాధించిన దేశంగా ఇండియా అరుదైన రికార్డును సంతం చేసుకుంది. అన్నట్లు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటో తెలుసా..? ఎయిరిండియాలో మహిళా ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా..? ఏకంగా 3,800 మంది. ఏమైనా పూర్తిగా మహిళలతో నడిపించిన ఈ ఫ్లైట్ జర్నీ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.