Begin typing your search above and press return to search.

ఈ దేశాలకు విమానాలు బంద్.. ఎయిర్ ఇండియా సంచలనం

By:  Tupaki Desk   |   13 March 2020 11:00 AM GMT
ఈ దేశాలకు విమానాలు బంద్.. ఎయిర్ ఇండియా సంచలనం
X
పలు దేశాలకు విమాన రాకపోకలు బంద్ చేస్తూ ఎయిర్ ఇండియా విమానాయన సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వరకు ఆయా దేశాలకు ఏకంగా విమానాలను రద్దు చేయడం ప్రయాణికులకు షాకింగ్ మారింది. దీనికంతటికి కారణంగా ‘కరోనా వైరస్’ ప్రభావమే.

కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్న ఇటలీ, ఫ్రాన్స్, సౌత్ కొరియా, కువైట్, మాడ్రిడ్ , కొలొంబో దేశాలు, నగరాలకు విమానాలను రద్దు చేస్తూ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా నిర్ణయించింది.

ఈ దేశాలు ప్రాంతాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇక్కడి నుంచి వచ్చిన వారే భారత్ లో కరోనా వ్యాప్తికి కారణమయ్యారని కేంద్రం గుర్తించింది. అది మరింత ముదరకుండా ఉండాలంటే వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

అందులో భాగంగానే కరోనా వ్యాప్తికి కారణమైన పలుదేశాలకు విమాన రాకపోకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం కారణంగా ఆయా దేశాలకు వెళ్లవలసిన వారు, అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఎయిర్ ఇండియా నిర్ణయం శరాఘాతంగా మారనుంది. అయితే ప్రాణాలు తీసే కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్రం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని ప్రయాణికులు అర్థం చేసుకోవాలని ఎయిర్ ఇండియా సూచించింది.