Begin typing your search above and press return to search.
మోడీ జర్నీలకు ఎయిరిండియా ఏడాది ఖర్చే అంతా?
By: Tupaki Desk | 7 May 2016 5:43 AM GMTప్రధానిగా మోడీ అధికారం చేపట్టి దాదాపు రెండేళ్లు దగ్గరకొస్తున్న పరిస్థితి. మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఏమైనా పెనుమార్పులు చోటు చేసుకున్నాయా? అన్న ప్రశ్న వేస్తే వెంటనే నోటి నుంచి వెనువెంటనే సమాధానం వచ్చే పరిస్థితి కనిపించొచ్చు. అవినీతి తగ్గిందన్న మాట కొందరు వ్యక్తం చేసినా.. కనిపించని స్థాయిలో గుట్టుగా సాగిపోతుందన్న విమర్శ ఉండనే ఉంది. కాకుంటే యూపీఏ హయాంలో మాదిరి బరితెగింపు ధోరణిలో కాకుండా కాస్త ఆచితూచి అన్న మాట పలువురి నోట వినిపిస్తూనే ఉంటుంది. ఇక.. ప్రధాని మోడీకి సంబంధించి గడిచిన రెండేళ్లలో మీరు ఏం గమనించారు? అని ఎవరినైనా ప్రశ్నించిన మరుక్షణం.. మోడీ ఫారిన్ టూర్లు ఎక్కువగా చేస్తుంటారన్న మాట వస్తుంది.
మోడీ విదేశీ ప్రయాణాలు మాటేమో కానీ.. ఆ కారణంగా పెడుతున్న ఖర్చు లెక్క వింటే కాస్త షాకింగ్ గా ఉంటుంది. 2015-16 ఏడాదిలో చేపట్టిన విదేశీ ప్రయాణాలకు అయిన ఖర్చు వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రధాని మోడీ ఫారిన్ టూర్ల సందర్భంగా అయ్యే మొత్తం ఖర్చు బయటకు రాకున్నా.. ఆయన ప్రయాణం కోసం వినియోగించే ఎయిరిండియా విమానాలకు అయిన ఖర్చు వివరాలు వెల్లడయ్యాయి. సమాచారహక్కు చట్టం పుణ్యమా అని ఈ వివరాలు బయటకు వచ్చాయని చెప్పొచ్చు.
ఇక.. మోడీ జర్నీ కోసం ఎయిరిండియా ఖాతాలో పెట్టిన ఖర్చు లెక్కలోకి వెళితే.. ఆయన అంతకు ముందు ఏడాది కంటే 25 శాతం ఎక్కువ ఖర్చు అయ్యింది. 2015 – 16 సంవత్సరంలో మోడీ 22 దేశాల్లో పర్యటించారు. అంటే.. నెలకు రెండు ఫారిన్ టూర్లు అన్న మాట. ఇందుకోసం ఎయిరిండియాకు అయిన ఖర్చు రూ.117 కోట్లుగా చెబుతున్నారు. మోడీ చేసిన ఖరీదైన ఫారిన్ టూర్ల విషయానికి వస్తే.. 2014లో చేసిన ఆస్ట్రేలియా.. మయన్మార్ జర్నీగా చెప్పొచ్చు. ఈ టూర్ కోసం ఎయిరిండియా చేసిన ఖర్చు రూ.22 కోట్లు. కాగా.. 2015 – 16 లో చేసిన టూర్లలో అత్యంత ఖరీదైన ట్రిప్ ఎదంటే ఫ్రాన్స్.. కెనడా.. జర్మనీ పర్యటనగా చెప్పొచ్చు. ఈ ట్రిప్ కోసం ఎయిరిండియా పెట్టి ఖర్చు రూ.31 కోట్లు కావటం గమనార్హం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మోడీ ఫారిన్ టూర్ల మొత్తంలో అత్యంత నాటకీయంగా జరిగిన పాకిస్థాన్ టూర్ గా చెప్పొచ్చు. ఆప్ఘనిస్తాన్ నుంచి తిరిగి వస్తున్న సందర్భంగా అనూహ్యంగా పాకిస్థాన్ కు వెళ్లటం.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనమరాలి పెళ్లికి హాజరుకావటం తెలిసిందే. ఈ ట్రిప్ కోసం ఎయిరిండియా పెట్టిన ఖర్చును మాత్రం అధికారులు వెల్లడించకపోవటం గమనార్హం. ఏమైనా ప్రధాని ఫారిన్ ట్రిప్పుల కోసం ఎయిరిండియా ఖర్చు చాలా ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖర్చుల విషయంలో మోడీ పరివారం కాస్త కేర్ ఫుల్ గా ఉండాల్సిందే సుమా.