Begin typing your search above and press return to search.

ఎంపీల దెబ్బ‌కు సీటింగే మార్చేశారు

By:  Tupaki Desk   |   2 Jun 2017 7:44 AM GMT
ఎంపీల దెబ్బ‌కు సీటింగే మార్చేశారు
X
సీట్ల మ‌ధ్య నెలకొన్న వివాదం దెబ్బ‌కు ఎయిరిండియా విమానాల్లో సీటింగ్ సిస్ట‌మే మారిపోయింది. త‌న ఎక‌నామీ విమానాల్లో కొత్త మార్పులు చేప‌ట్ట‌ట‌మే కాదు.. ఆ విమానాల్లోనూ బిజినెస్ క్లాస్ పేరుతో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌.. ఎయిరిండియా విమానం ఎక్కే వేళ చోటు చేసుకున్న వివాదం.. ఎంతగా ముదిరిందో తెలిసిందే. ఆ త‌ర్వాత కాలంలో బీజేపీ ఎంపీ అరుణ్ చ‌ర‌ణ్ సేథి కూడా ఎయిరిండియాలో బిజినెస్ క్లాస్ సీట్లు ఏవంటూ ప్ర‌శ్నించ‌టం.. అది కూడా వివాదంగా మారింది.

దీంతో.. ఎయిరిండియా త‌న ఎకాన‌మీ విమానాల్లో బిజినెస్ క్లాస్‌ ను ఏర్పాటు చేసేందుకు డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా మొద‌టి మూడు వ‌రుస‌ల్లోని సీట్ల‌కు మార్పులు చేర్పులు చేయ‌నుంది. ఎకాన‌మీ విమానాల్లో ఏర్పాటు చేసే బిజినెస్ క్లాస్ లో.. మొద‌టి మూడు వ‌రుస‌ల త‌ర్వాత క‌ర్టెన్ల‌ను అమ‌రుస్తారు. అంతేకాదు.. సీట్ల మ‌ధ్య దూరం కూడా ఉండ‌నుంది. వీటితో పాటు.. వీరికి అందించే ఆహారానికి మార్పులుంటాయి.

ఎయిరిండియాకు మొత్తం 150 విమానాలు ఉండ‌గా.. అందులో డ‌జ‌న‌కు పైగా విమానాల్లో కేవ‌లం ఎకాన‌మీ సీట్లు మాత్ర‌మే ఉన్నాయి. వీటిల్లో తాజాగా తీసుకున్న మార్పుల ప్ర‌కారం.. బిజినెస్ క్లాస్ సీట్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/