Begin typing your search above and press return to search.
అమెరికా వెళ్లడానికి షార్ట్ కట్ ఇదే!
By: Tupaki Desk | 29 Aug 2016 4:59 AM GMTఅమెరికా వెళ్లడానికి షార్ట్ కట్ దొరికింది. సాదారణంగా రోడ్డు మార్గాల విషయంలోనే కదా ఈ షార్ట్ కట్ అనే పదాలను వాడతారు అనుకుంటాం కానీ.. తాజాగా ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే విమాన మార్గం విషయంలో ఒక అడ్డదారి / షార్ట్ కట్ దొరికింది. ఈ విషయాలను ఎయిరిండియా తెలిపింది. ఈ కొత్త మార్గం వల్ల సమయం - ఇంధనం కూడా ఆదా అవుతాయని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న మార్గం గుండా వెళ్లినదానికంటే.. కొత్తమార్గం గుండా వెళితే... 1400 కి.మీ. దూరం పెరుగుతుంది. అయినా కూడా ఇందనం - సమయం ఆదా అవుతుందంటున్నారు. ఆ లాజిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోకు ఇండియానుంచి వెళ్లాలంటే ఢిల్లీ నుంచి అట్లాంటిక్ సముద్రం మీదుగా విమానాలు నడుస్తున్నాయి. అయితే కొత్తగా వచ్చిన అనుమతి ప్రకారం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు పసిఫిక్ సముద్రం మీదుగా విమానాలు నడిపేందుకు ఎయిరిండియాకు అనుమతి వచ్చింది. దీనివల్ల ప్రయాణ సమయం - భారీగా విమాన ఇంధనం ఆదా అవుతాయని ఎయిరిండియా తెలిపింది. అయితే అట్లాంటిక్ సముద్రం మీదుగా వెళ్తే.. మరో 1,400 కిలోమీటర్ల దూరం అధికం అవుతుంది. అలాంటప్పుడు పాత మార్గమే బెటర్ కదా అనుకుంటే.. కొత్త మార్గంలో దూరం ఎక్కువైనా కానీ.. వాలు గాలుల సానుకూలత వల్ల ప్రయాణ సమయం 1-3 గంటల వరకూ తగ్గుతుందట.
విమానం గంట ప్రయాణించేందుకు సుమారు 9,600 లీటర్ల ఇంధనాన్ని వినియోగించుకుంటోంది.. దీంతో ఈ కొత్త ప్రయాణం వల్ల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని చెబుతున్నారు అధికారులు. ఇంతకూ దూరం పెరిగితే పెట్రోలు వాడకం, సమయం ఎలా తగ్గుతాయనే అనుమానానికి సమాధానం ఏమిటంటే... ప్రస్తుతం ఉన్న అట్లాంటిక్ మీదుగా వెళ్లే మార్గంలో గంటకు 24కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయి. దీంతో విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా కూడా వాస్తవానికి అది 776 కి.మీ. గానే అవుతుంది. అదే కొత్త మార్గం ఫసిఫిక్ సముద్రం మీదుగా అయితే గంటకు 138 కిలోమీటర్ల వేగంతో సానుకూల గాలులు వీస్తాయి..దీంతో విమానం గంటకు 800 కి.మీ. ప్రయాణించినా.. అది 938 కి.మీ. అవుతుందని ఎయిరిండియా ఫైలట్ లు చెబుతున్నారు. ఈ లెక్కన అమెరికాకు ఎంతోకొంత షార్ట్ కట్ మార్గం దొరికినట్లే కదా!