Begin typing your search above and press return to search.
ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద భారీ క్యూలు.. అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు..!
By: Tupaki Desk | 21 Dec 2022 2:30 AM GMTముంబై ఎయిర్ పోర్టులో ఇమ్మి గ్రేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు భారీగా క్యూ లైన్లలో వెయిట్ చేయడంపై వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముంబై నుంచి కువైట్ కు వెళ్లడానికి మూడున్నర గంటల సమయం పడితే ఎయిర్ పోర్టులోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ నుంచి బయటికి రావడానికి 3 గంటల సమయం పడుతుండటంపై ప్రయాణికులు మండి పడుతున్నారు.
అంతర్జాతీయ గుర్తింపు పొందిన ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రయాణికులంతా వారంతా బయోమెట్రిక్ గుర్తింపు ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఎయిర్ పోర్టులో 24 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. అయితే వాటిని నిర్వహించడానికి తగినంత సిబ్బంది లేరని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
దీంతో మంగళవారం నాడు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో ప్రయాణీకులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద వందలాదిగా బారులు తీరాల్సి వచ్చిందని ప్రయాణికులు వాపోయారు. సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టు నుంచి బయటికి వెళ్లేందుకు ఏకంగా మూడు నుంచి 4 గంటల సమయం పట్టిందని చెబుతున్నారు.
ఇదే విషయాన్ని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. ‘‘కువైట్ నుంచి ముంబై బయలు దేరడానికి 3:30 గంటల సమయం పడితే బయటకు రావడానికి 3గంటల సమయం పడుతోందని’’ ఒక ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశాడు. 100 మందికి పైగా ప్రయాణికులు క్యూ లైన్లలో ఉండగా ముంబైలో ఒకే ఇమ్మిగ్రేషన్ కౌంటర్ తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరొక ప్రయాణికుడు ఎయిర్ పోర్టు నుంచి బయటికొస్తూ ఇలా మాట్లాడారు. ‘‘ముంబై ఎయిర్‌పోర్ట్ అరైవల్స్ టీ2 టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన ఇమ్మిగ్రేషన్‌లో సోమవారం రాత్రి స్కానింగ్ సమస్యలతో కేవలం 24-30 కౌంటర్లు మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు. ప్రయాణీకులు ఇమ్మిగ్రేషన్‌ను క్లియర్ చేయడానికి 3 నుంచి 4 గంటలు వేచి ఉండాల్సి వస్తుందని వాపోయాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.