Begin typing your search above and press return to search.
16 లక్షల మంది చైనాలో చచ్చేది అందుకా?
By: Tupaki Desk | 19 Nov 2015 4:32 AM GMTకంటి ముందు కనిపించినా.. పెద్దగా పట్టించుకోని భూతాల్లో కాలుష్యభూతం ఒకటి. మనిషి ప్రాణాల్ని తీసేసే ఈ ప్రమాదకర భూతాన్ని ఇప్పటివరకూ పెద్దగా పట్టించుకున్నది లేదు. ఈ కాలుష్య కారణంగా జీవితాలు ఎంత ప్రమాదకరంగా తయారవుతాయన్న దానిపై తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. ప్రపంచదేశాల్ని పక్కన పెడితే.. ఒక్క చైనాలో ఒక్క వాయు కాలుష్యం కారణంగానే ఆ దేశంలో ప్రతి ఏటా మరణించే వారి సంఖ్య ఏకంగా 16లక్షలని తేల్చింది.
ఎవరూ ఊహించని మరో విషయం ఏమిటంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్.. మలేరియా.. రొమ్ము క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల కారణంగా మరణించే వారి కంటే కూడా వాయు కాలుష్యం కారణంగా ఎక్కువమంది మరణిస్తున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. వాయుకాలుష్యం మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలే కానీ.. దీన్ని నియంత్రించటంపెద్ద కష్టం కాదని చెబుతున్నారు.
దీనికి ఒక చక్కటి ఉదాహరణను చూపిస్తున్నారు. రెండో ప్రపంచ యద్ధం జరిగి 70 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఒక భారీ కార్యక్రమాన్ని చైనా చేపట్టింది. ఇందులో భాగంగా చైనా రాజధాని బీజింగ్ లో సెప్టెంబర్ లో రెండు వారాలపాటు వాహనాల మీద నిషేధం విధించారు. దీంతో.. 25 లక్షల వాహనాలు రెండు వారాల పాటు రోడ్ల మీదకు రాలేదు. ఈ సందర్భంగా అక్కడి వాయు కాలుష్యాన్ని కొలిచినప్పుడు విస్మయకర విషయాలు బయటకు వచ్చాయి.
నిషేధం విధించిన రెండు వారాల్లో వాయు కాలుష్యం.. వాహనాలు ఉండే దాంతోపోలిస్తే భారీగా తగ్గినట్లు గుర్తించారు. మామూలు రోజుల్లో బీజింగ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 160 పాయింట్లుగా ఉంటే.. రెండు వారాల పాటు వాహన వినియోగం మీద నిర్వహించిన నియంత్రణ కారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విపరీతంగా మెరుగుపడి 17 పాయింట్లకు తగ్గిపోయింది. అంటే.. మొత్తం కాలుష్యంలో 90 శాతం వాయు కాలుష్యం ఆ రెండు వారాలు లేదన్న మాట. వాయు కాలుష్యం కారణంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా 70లక్షలకు పైగా మరణాలు సంభవిస్తుంటే.. వాటిల్లో 30లక్షలకు పైగా వాయుకాలుష్య మరణాలు చైనా.. భారత్ లలో చోటు చేసుకోవటం గమనార్హం. అంటే.. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే మరణాల్లో మూడింట రెండొంతుల మరణాలు చైనా.. భారత్ లో చోటు చేసుకోవటం గమనార్హం.
వాయు కాలుష్యానికి కారణాలు చూస్తే.. చెట్లను నరికివేయటం.. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం.. పవర్ ఫ్లాంట్స్.. వాహనాల నుంచి వెలువడే పొగ.. చెత్తను తగలబెట్టటం.. పొగతాగటం కారణంగా వాయుకాలుష్యం చోటు చేసుకుంటుందని తేలింది. అందుకే.. వాయు కాలుష్యం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. వాయుకాలుష్యాన్ని లైట్ తీసుకునే వారంతా.. దాని వల్ల ఏస్థాయిలో బాధితులం అవుతామన్నది గమనించాల్సిన అవసరం ఉంది.