Begin typing your search above and press return to search.
హైదరాబాదీయుల గుండెలు అదిరే విషయం వెల్లడైంది!
By: Tupaki Desk | 14 July 2019 6:02 AM GMTతాగే నీళ్లు తేడా కొట్టి చాలా కాలమే అయ్యింది. దీంతో నల్లా నీళ్లను వదిలేసి.. అందరూ బబుల్స్ లేదంటే ఆర్వోలు పెట్టేసుకున్న పరిస్థితి. అయినప్పటికీ తాగే నీళ్లలో ఏదో ఒక తేడా కొట్టి రోగాల బారిన పడటం అనుభవమే. తాగే నీటి విషయంలో జాగ్రత్త ఈ మధ్యన పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా బయటకు వచ్చిన మరో షాకింగ్ నిజం ఏమంటే.. హైదరాబాద్ లో పీల్చే గాలి మరణానికి చేరువ అయ్యేలా చేస్తుందన్న కఠిన నిజం బయటకు వచ్చింది. ఇటీవల కాలంలో భాగ్యనగరివాసులు పీల్చే గాలిలో ఏ మాత్రం స్వచ్ఛత లేదన్న విషయం తాజాగా చేసిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నట్లు గ్రీన్ పీస్ సంస్థ వెల్లడించింది.
హైదరాబాద్ లో ఒక పక్క ఉండే పరిశ్రమలు.. మరోవైపు లక్షలాదిగా నిత్యం రోడ్ల మీద తిరిగే వాహనాలు ప్రమాద కర వాయు కాలుష్యాన్ని విడుదల చేస్తున్న కారణంగా నగర వాసులు జబ్బులపాలు అవుతున్నట్లుగా చెబుతున్నారు. గాల్లో అంతకంతకూ పెరుగుతున్న వాయు కాలుష్య తీవ్రతతో హైదరాబాద్ నగరం డేంజరస్ గా మారుతుందన్న మాట ఆ సంస్థ పేర్కొంది.
గ్రీన్ పీస్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం వాహనాలతో విడుదల అవుతున్న వాయు కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని.. ఇదే విషయాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొంది. దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతున్న నగరాల్లో ఢిల్లీ.. బెంగళూరు.. కోల్ కతా.. చెన్నై.. హైదరాబాద్ లుగా గుర్తించారు. వాయు కాలుష్యంలో నైట్రోజన్ ఆక్సైడ్ అంకతంతకూ పెరుగుతోందని.. ఓజోన్ వాయువులతో పాటు కంటికి కనిపించనంత అత్యంత సూక్ష్మమైన ధూళితో ప్రజలు జబ్బున పడేలా చేస్తున్నాయని తేల్చింది. పీల్చే గాలిలో ఓజోన్ ఉంటే అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఆస్తమా బాధితులు.. పిల్లలు.. పెద్ద వయస్కులు ఈ ప్రమాదకర వాయువుల్ని పీల్చటం ద్వారా ఛాతీనొప్పి.. దగ్గు.. గొంతుమంట.. శ్వాసనాళాల వాపు లాంటి సమస్యలు పొంచి ఉన్నాయని తేల్చారు.
వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 3.4 మిలియన్ల మంది మరణిస్తే.. భారత్ లో 1.2 మిలియన్ల మంది మరణించినట్లుగా నివేదిక పేర్కొంది. పీఎం2.5 కారణంగా దేశంలో 6.7 లక్షలకు పైగా మరణాలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. పీఎం2.5.. నైట్రోజన్ ఆక్సైడ్స్.. ఓజోన్ కాలుష్యం కారణంగా గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నివేదిక నేపథ్యంలో నగరవాసులు వీలైనంతవరకూ తమ చుట్టూ ఉన్న పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు.. మొక్కల్ని ఎక్కువగా పెంచటం ద్వారా ముప్పును అంతో ఇంతో తగ్గించుకునే వీలుంది.