Begin typing your search above and press return to search.
ఎయిర్ పోర్ట్ నుంచి విమానం ఎత్తుకెళ్లారు
By: Tupaki Desk | 11 Aug 2018 7:24 AM GMTఔను. సాక్షాత్తు విమానం చోరికి గురైంది! అది కూడా ఎయిర్ పోర్ట్ నుంచి!. ఆ విమానాన్ని పట్టుకునేందుకు ఫైటర్లు వెంబడించారు. ఇదంతా జరిగింది అమెరికాలో. సియాటిల్ లోని టకోమా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానాశ్రయంలో పార్కింగ్ చేసి ఉన్న విమానాన్ని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఆయన ఎవరయ్యా అని ఆరాతీస్తే..... సంస్థకు చెందిన 29 ఏళ్ల ఓ ఉద్యోగి అని తేలింది. 78 సీట్లు ఉన్న ఆ ప్లేన్ లో ప్రయాణికులు ఎవరూ లేరు. ఏటీసీ అనుమతి లేకుండానే..విమానాన్ని చోరీ చేశాడని - అయితే ఆ విమానం కీట్రన్ దీవుల్లో కూలినట్లు పోలీసులు చెబుతున్నారు.
సియాటిల్ ఆకాశ మార్గంలో ఓ ప్లేన్ విపరీతంగా చక్కర్లు కొడుతూ కనిపించింది. పల్టీలు కొడుతున్న విమానాన్ని.. అనేక మంది తమ మొబైల్ ఫోన్ లో బంధించారు. ఆ వీడియోలే షోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఓ విమానాన్ని ఎయిర్ పోర్ట్ నుంచి దొంగలించారని వార్తలు వచ్చాయి. అధికారులు వివరాలు సేకరించిన అనంతరం హోరైజన్ ఎయిర్ క్యూ400 విమానాన్ని ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. దీంతో ఆ విమానాన్ని అమెరికా జెట్ ఫైటర్లు వెంబడించాయి. కాగా, ప్లేన్ ను ఎత్తుకెళ్లిన పైలట్ ఏమయ్యాడన్న దానిపైన కూడా స్పష్టత లేదు. అయితే ఈ ఘటన ఉగ్రవాద చర్య కాదు అని పియర్స్ కౌంటీ పోలీసులు చెప్పారు.